మెగా కుటుంబంలో మరో పెళ్లి బాజా మోగబోతోంది! టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన సాయి దుర్గా తేజ్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కనున్నాడు. నవంబర్ 5వ తేదీన అత్యంత నిరాడంబరంగా, కుటుంబ సభ్యుల సమక్షంలోఆయన నిశ్చితార్థం జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.
సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థానికి సంబంధించిన విషయాలను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘డియర్ తేజ్, కిరణ్.. మీ కొత్త జీవిత ప్రయాణం ఆనందంగా సాగాలి. మీ ఇద్దరి మధ్య ప్రేమ, అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి’ అంటూ రామ్ చరణ్ రాసుకొచ్చారు. #KiranTejForever అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన షేర్ చేసిన ఈ ఫొటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇక ఈ వేడుక ప్రత్యేకత ఏంటంటే.. మెగా, అల్లు కుటుంబాలన్నీ ఒక్కచోట చేరి సందడి చేశాయి. మెగాస్టార్ చిరంజీవి దంపతులు సురేఖ, రామ్ చరణ్, అల్లు అర్జున్, స్నేహారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు నాగబాబు, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నిహారిక కొణిదెల, అల్లు అరవింద్, అల్లు శిరీష్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. అంతేకాదు, పవన్ కల్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్య కూడా ఈ వేడుకలో సందడి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. సినీ పరిశ్రమ నుంచి మంచు మనోజ్, భూమా మౌనిక, నవదీప్, హర్ష చెముడు, దర్శకుడు వెంకీ కుడుముల తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.”
మరోపక్క సాయి దుర్గా తేజ్ కాబోయే భార్య కిరణ్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. కిరణ్ ఆయనకు చిన్ననాటి స్నేహితురాలని, చాలాకాలంగా వీరిద్దరికీ పరిచయం ఉందని సమాచారం. ఈ స్నేహమే ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కిరణ్ కుటుంబ నేపథ్యం, చదువు, వృత్తికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. నిశ్చితార్థం ముగిసింది..ఇక పెళ్లి ఎప్పుడంటూ మెగాఫ్యాన్స్ ఆసక్తి ఎదురుచూస్తున్నారు.. నవంబర్ 5న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సాయి దుర్గా తేజ్, డిసెంబర్ 10 న ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వేదికగానే ఈ అద్భుతమైన వివాహ వేడుక జరగనుందని సమాచారం. నిశ్చితార్థానికే మెగా, అల్లు కుటుంబాలన్నీ కదిలిరాగా.. ఇక పెళ్లి వేడుక ఎంత అట్టహాసంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లి వేదిక, ముహూర్త సమయం, సినీ ప్రముఖుల రాకకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే తెలియనుంది.
రీసెంట్ ఇయర్స్‌లో బ్యాచిలర్‌గా ఉన్న సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ లైఫ్‌లోకి ఇలా తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్ తోడుగా రావడం మెగా అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. సోషల్ మీడియాలో అభిమానులు #KiranTejForever ట్రెండ్ చేస్తూ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
