ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వెతికినా ఒకటే మాట.. ఒకటే పేరు వినిపిస్తోంది. అదే.. సాయి పల్లవి! నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన విజువల్ వండర్ ‘రామాయణ: పార్ట్ 1’ థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ కనిపిస్తే.. మనందరి గుండెల్లో నిలిచిపోయేలా సీతాదేవిగా జీవించేసింది సాయి పల్లవి.
నిజంగా అండి.. ఈ రోజుల్లో ఒక పౌరాణిక పాత్ర చేయాలంటే భారీగా నగలు, రంగురంగుల కాస్ట్యూమ్స్, హెవీ మేకప్ ఉండాలనుకుంటారు. కానీ సాయి పల్లవి వీటన్నింటికీ అతీతం. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా, జీరో పర్సెంట్ మేకప్‌తోనే ఆ సీతమ్మ పాత్రలో దైవికత్వాన్ని, హుందాతనాన్ని స్క్రీన్ పైన పండించింది. ఆమె కళ్లలోనే ఒక పవిత్రత కనిపించింది. అందుకే సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం “సీతమ్మ అంటే ఇలాగే ఉండాలి” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కూడా “సీతగా సాయి పల్లవి పాత్రలో జీవించేసింది” అని కొనియాడారంటే అర్థం చేసుకోండి.. ఆమె నటన ఏ రేంజ్‌లో ఉందో!
అయినా సాయి పల్లవికి ఇదొక లెక్కా చెప్పండి? ‘ఫిదా’ సినిమాలో భానుమతిగా వస్తే.. హైబ్రిడ్ పిల్ల అంటూ కుర్రాళ్లంతా ఫిదా అయిపోయారు. ‘శ్యామ్ సింగరాయ్’లో దేవదాసిగా రోజీ పాత్రలో ఆమె చేసిన క్లాసికల్ డ్యాన్స్, చూపించిన ఎమోషన్స్ ఎవరైనా మర్చిపోగలరా? అలాగే ‘గార్గి’, ‘విరాటపర్వం’ లాంటి సినిమాల్లో తన నటనతో మనల్ని ఏడిపించేసింది. గ్లామర్ నమ్మే ఇండస్ట్రీలో.. కేవలం తన “సహజ నటనను” మాత్రమే నమ్ముకుని లేడీ పవర్ స్టార్‌గా ఎదిగింది సాయి పల్లవి. ఇప్పుడు ఈ ‘రామాయణ’ సినిమాతో నేషనల్ వైడ్‌గా తనేంటో మరోసారి ప్రూవ్ చేసుకుంది.
అయితే, సినిమా అన్నాక కొద్దిగా విమర్శలు కూడా వస్తుంటాయి కదా. కొంతమంది ప్రేక్షకులు ఏమంటున్నారంటే.. సీతమ్మకు ఉండాల్సిన ఆ రాజసపు తేజస్సు కాస్త తగ్గిందని, రాముడు-సీత మధ్య ఎమోషనల్ బాండింగ్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇవన్నీ పక్కన పెడితే.. ఓవరాల్‌గా ఒక నటిగా సాయిపల్లవి తనదైన శైలిలో సీతాదేవి పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరి చేత మంచి మార్కులే కొట్టేసింది.
ఏదేమైనా, మేకప్ లేకుండా కూడా కేవలం కళ్లతో, నటనతో ఒక దైవికమైన పాత్రను మెప్పించడం ఒక్క సాయి పల్లవికే సాధ్యమైంది. రాబోయే పార్ట్స్‌లో ఆమె నటన ఇంకా ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి. మరి ‘రామాయణ’ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి.
