హైదరాబాద్‌లోని బోరబండలో దారుణం చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఓ దుర్మార్గపు తండ్రి కన్న కొడుకు గొంతు పిసికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే రాత్రి వేళ క్యాటరింగ్ పనికి వెళ్లి ఉదయాన్ని ఇంటికొచ్చే సరికి కుమారుడి చనిపోయి కనిపించాడు. ఈ సీన్ చూసిన తల్లి అయ్యో దేవుడా అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చిన తీరు స్థానికుల్ని సైతం కంటతడి పెట్టించింది. అసలు బోరబండ శిల్పినగర్‌లో రాత్రి ఏం జరిగింది? తండ్రి ఇంతటి ఘోరానికి పాల్పడానికి రీజన్ ఏంటి..?
బోరబండ శిల్పినగర్ ప్రాంతానికి చెందిన విద్యాసాగర్ అనే వ్యక్తి 36 ఏళ్ల వ్యక్తి నిన్న రాత్రి 10 గంటల సమయంలో తీవ్ర మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న తన ఐదేళ్ల కుమారుడు విజయ్‌పై విచక్షణారహితంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో రాక్షసుడిగా మారిన విద్యాసాగర్.. ఏమాత్రం కనికరం లేకుండా ఆ పసికందు గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. కనీసం అడ్డుచెప్పేనాథుడు లేకపోవడంతో ఆ పసిప్రాణం గాలిలోనే కలిసిపోయింది.”
“అయితే ఈ దారుణం జరిగిన సమయంలో బాలుడి తల్లి దుర్గ ఇంటి వద్ద లేదు. జీవనోపాధి కోసం ఆమె రాత్రి వేళ క్యాటరింగ్ పనికి వెళ్లింది. విధులు ముగించుకుని తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చి చూడగా, నిద్రిస్తున్నట్లు ఉన్న కొడుకు విజయ్ ఎంతకీ కదలకపోవడంతో అనుమానం వచ్చి పరిశీలించింది. అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయి అచేతనంగా పడి ఉండటం చూసి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. వెంటనే తేరుకుని పొరుగువారికి విషయం తెలియజేయడంతో ఈ దారుణ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.”
స్థానికులు వెంటనే బోరబండ పోలీసులకు సమాచారం అందించారు. దారుణానికి ఒడిగట్టిన తండ్రి విద్యాసాగర్, పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే బోరబండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పసికందును అత్యంత కిరాతకంగా చంపిన నిందితుడు విద్యాసాగర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.”
మద్యం మత్తు మనుషులను ఏ స్థాయికి దిగజార్చుతుందో నిరూపించేలా ఉన్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపింది. పరారీలో ఉన్న నిందితుడు విద్యాసాగర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. కన్న కొడుకునే గొంతు నులిమి చంపిన ఈ దుర్మార్గుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు
