SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » tv shows » Jayammu Nischayammura Season 2 Sai Pallavi

జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • Written By: Ayyappa Panja
  • Published Date - Wed - 14 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై  సాయి పల్లవి

మన మనసులో నిలిచిపోయే సంభాషణలు చాలాసార్లు మనకు తెలిసిన విషయాలను దాటి, ఒక వ్యక్తిలోని అసలైన మనిషిని పరిచయం చేస్తాయి. జీ తెలుగు పాపులర్ సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి రెండో సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి అతిథిగా హాజరుకానున్నారు. సహజమైన నటనతో, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవి.. ఈ షో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు. మనసులోని మాటలను నిక్కచ్చిగా బ‌య‌ట‌కు తెలిజ‌యేసే సంభాషణలు, వ్యక్తిగత జ్ఞాపకాలు, ఆసక్తికరమైన విషయాలు, వినోదభరితమైన విశేషాలతో ఈ కొత్త సీజన్ ప్రేక్షకులను అలరించనుంది.

ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షో.. వెండితెరపై కనిపించే తారల వ్యక్తిగత జీవితాల్లోని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తొలి సీజన్‌లో అక్కినేని నాగార్జున, శ్రీలీల వంటి ప్రముఖులు అతిథులుగా పాల్గొని, తమ వ్యక్తిగత జీవిత విశేషాలు, సినీ ప్రయాణం, అనుబంధాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హోస్ట్ జగపతిబాబు, సెలబ్రిటీల మధ్య జరిగే సహజమైన సంభాషణలే ఈ షోకు ప్రధాన ఆకర్షణ. తమ జీవితాలను మలుపు తిప్పిన అనుభవాలు, ఇప్పటివరకు పెద్దగా బయటకు రాని జ్ఞాపకాలు, తమ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు, మరచిపోలేని సంఘటనల గురించి సెలబ్రిటీలు మనసు విప్పి మాట్లాడే అవకాశం ఈ షో కల్పిస్తోంది. ఇప్పుడు రెండో సీజన్ కూడా ఇదే ప్రత్యేకమైన సంభాషణల శైలిలో మరిన్ని వ్యక్తిగత విశేషాలు, ఆసక్తికరమైన ముచ్చట్లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా కొత్త సీజన్ సాయి ప‌ల్ల‌వితో ప్రారంభం కానుంది. న‌టిస్తోన్న‌ పాత్రల్లో సహజత్వానికి ప్రాధాన్యమిస్తూ, భావోద్వేగాలతో పాటు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలతో ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా సీత పాత్రతో ప్రేక్షకుల్లో ఆమెపై అభిమానం మరింత పెరిగింది. చాలామంది ఆమెను తమ ఇంటి అమ్మాయిలా భావిస్తూ మా సీత అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న రామాయణ చిత్రంలో సీతగా సాయి పల్లవి ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమా టైటిల్‌ను ప్రకటించిన తర్వాత సాయి పల్లవి పాల్గొంటున్న తొలి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇదేనని నిర్వాహకులు చెబుతున్నారు. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో నిరాడంబరంగా ఉండే ఆమె, మనసులోని మాటలను ఉన్నది ఉన్నట్టుగా పంచుకునే విధానం సాయి పల్లవిని సమకాలీన భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా నిలబెడుతోంది.

Join Our Whatsapp Channel

ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌లో సాయి పల్లవి, జగపతిబాబుతో కలిసి ఆహ్లాదకరమైన, ఆసక్తికరంగా మాట్లాడ‌బోతున్నారు. తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జ్ఞాపకాలు, ఇప్పటివరకు ప్రేక్షకులకు పెద్దగా తెలియని పలు ఆసక్తికరమైన విషయాలను ఆమె ఈ సందర్భంగా తెలియ‌జేయ‌నున్నారు. ‘రామాయణ’ చిత్రంలో సీతగా సాయి పల్లవి ఎలా కనిపించనున్నారనే ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో.. ఆమె వ్యక్తిత్వం, ఆలోచనలు, జీవితంలో ఎదురైన అనుభవాల గురించి తెలుసుకునే అవకాశం ఈ ఎపిసోడ్ ద్వారా ప్రేక్షకులకు లభించనుంది. జగపతిబాబు తనదైన శైలిలో సంభాషణను ముందుకు నడిపించనుండటంతో.. ఇద్దరి మధ్య జరిగే ఈ ముచ్చట్లు సహజమైన హాస్యం, ఆత్మీయతతో ప్రేక్షకులను అలరించనున్నాయి.

ఈ గ్రాండ్ లాంచ్‌తో రెండో సీజన్‌కు శ్రీకారం చుట్టడమే కాకుండా.. వెండితెరపై అభిమానించే తారల వ్యక్తిగత జీవితాలకు ప్రేక్షకులను మరింత దగ్గర చేసే ప్రయత్నం చేయనున్నారు. హాస్యం, పాత జ్ఞాపకాలు, మనసు విప్పి మాట్లాడుకునే సంభాషణలు, వ్యక్తిగత అనుభవాల కలయికగా ‘జయమ్ము నిశ్చయమ్మురా షో సాగనుంది. సాధారణ ప్రమోషనల్ ఇంటర్వ్యూలకు భిన్నంగా.. సినిమా విశేషాలకే పరిమితం కాకుండా, సెలబ్రిటీల వ్యక్తిత్వం, వారి జీవిత ప్రయాణం, అనుభవాలకు ఈ షో ప్రాధాన్యత ఇవ్వనుంది.

జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి రెండో సీజన్ అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే అక్టోబర్ 18, ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగులో టెలివిజన్ ప్రసారం కానుంది. తొలి ఎపిసోడ్‌లో సాయి పల్లవి సందడి చేయనుండటంతో ఈ సీజన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తెరపై తారలుగా కనిపించే సెలబ్రిటీల వెనుక ఉన్న అసలైన వ్యక్తిత్వాన్ని, వారి జీవితంలోని ఆసక్తికరమైన కథలను ఆవిష్కరిస్తూ ఈ షో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Tags :

  • Jayammu Nischayammura Season 2
  • Sai Pallavi Interview
  • SumanTV
  • ZEE5 Telugu
  • జగపతిబాబు
  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2
  • జీ తెలుగు షో
  • సాయి పల్లవి
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • యాక్సిడెంట్ లో నా పళ్ళు ఊడిపోయి, లిప్ కట్ అయింది: MB చౌదరి!

    యాక్సిడెంట్ లో నా పళ్ళు ఊడిపోయి, లిప్ కట్ అయింది: MB చౌదరి!

  • యూట్యూబ్ పై పట్టు సాధిస్తే లక్షలు సంపాదించవచ్చు!

    యూట్యూబ్ పై పట్టు సాధిస్తే లక్షలు సంపాదించవచ్చు!

  • యూట్యూబర్‌గా మారి లక్షలు సంపాదిస్తున్న వంట మాస్టర్‌!

    యూట్యూబర్‌గా మారి లక్షలు సంపాదిస్తున్న వంట మాస్టర్‌!

  • Silk Smitha: సిల్క్‌స్మిత బతికే ఉన్నారు.. ఇదిగో ప్రూఫ్‌!

    సిల్క్‌స్మిత బతికే ఉన్నారు.. ఇదిగో ప్రూఫ్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

  • ఫ్యూచర్ లో ఉండేవి ఈ మూడు ఉద్యోగాలే.. అసలు నిజం చెప్పిన AI ఎక్స్ పర్ట్

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam