బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’తో రెడీ అయిపోయారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. దసరా పండుగ కానుకగా అక్టోబరు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. అయితే, ఈ సినిమా విడుదల కంటే ముందే తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ‘జైలర్ 2’ బిజినెస్‌కు భారీ బూస్ట్ ఇచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది!
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ భారీ రేటుకు సొంతం చేసుకుంది. మరి పెట్టిన పెట్టుబడులు వేగంగా వెనక్కి రావాలి కదా? అందుకే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేసిన విజ్ఞప్తిని మన్నించిన ఏపీ ప్రభుత్వం.. సినిమా రిలీజ్ రోజైన అక్టోబరు 15 నుంచి వారం రోజుల పాటు, అంటే అక్టోబరు 21 వరకు టికెట్ రేట్లను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రభుత్వ జీవో ప్రకారం.. ప్రతి టికెట్ పైన రూ. 75 అదనంగా కట్టాల్సి ఉంటుంది. అదే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అయితే, టికెట్ ధరపై రూ. 50 ఎక్స్‌ట్రా వసూలు చేసుకోవచ్చు. ఈ అదనపు ధరలన్నీ జీఎస్టీతో కలిపే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.కేవలం రేట్లు పెంచడమే కాదు.. రజినీకాంత్ ఫ్యాన్స్ డిమాండ్‌ను తట్టుకోవడానికి ప్రభుత్వం మరో అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. మొదటి వారం రోజుల పాటు రోజుకు ఏకంగా ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు. దీనివల్ల థియేటర్ల దగ్గర రద్దీ తగ్గడమే కాకుండా, కలెక్షన్లు ఊహించని రేంజ్‌లో రావడం ఖాయం.
