దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది PF వినియోగదారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి… ఇప్పటివరకు మన పీఎఫ్ అకౌంట్‌లో ఉన్న డబ్బులు అత్యవసరంగా కావాలంటే… ఆన్‌లైన్‌లో క్లెయిమ్ ఫామ్ నింపాలి, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి, ఆ తర్వాత అప్రూవల్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాలి. కానీ ఇకపై ఆ ఇబ్బందులకు చెక్ పడబోతోంది! మనం రోజువారీ కిరాణా కొట్లో, టీ స్టాల్‌లో Google Pay, PhonePe లేదా Paytm వంటి UPI యాప్స్‌తో ఎంత సులభంగా డబ్బులు పంపిస్తున్నామో… త్వరలోనే అదే విధంగా నేరుగా UPI ద్వారా మన PF డబ్బులను విత్‌డ్రా చేసుకునే అద్భుతమైన సదుపాయం రాబోతోంది. అవును, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO తీసుకురాబోతున్న EPFO 3.0 అప్‌డేట్‌లో భాగంగా ఈ సరికొత్త విప్లవాత్మక మార్పు అందుబాటులోకి రానుంది. అసలు ఈ కొత్త సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? దీనివల్ల సామాన్య ఉద్యోగికి కలిగే లాభాలేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం!
ముందుగా పాత పద్ధతికి, రాబోయే కొత్త పద్ధతికి మధ్య ఉన్న తేడాను చూద్దాం.. ఇప్పటివరకు ఉన్న పద్ధతి గురించే తెలుసుకుంటే…. మన పీఎఫ్ ఖాతా నుండి డబ్బులు తీసుకోవాలంటే EPFO పోర్టల్ లేదా UMANG యాప్‌లోకి వెళ్లి ఫామ్-31 లేదా ఇతర క్లెయిమ్ ఫామ్‌లు నింపాల్సి వచ్చేది. ఆ తర్వాత అది వెరిఫికేషన్‌కు వెళ్లి, మన బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవ్వడానికి కనీసం 3 రోజుల నుండి 10 రోజుల వరకు సమయం పట్టేది. ఏదైనా చిన్న తప్పు ఉంటే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేది. అయితే త్వరలో రాబోతున్న EPFO 3.0 వ్యవస్థలో… పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియను నేరుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (నిర్వహిస్తున్న UPI ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేస్తున్నారు. అంటే, అర్హత ఉన్న పీఎఫ్ మొత్తాన్ని క్లెయిమ్ ఫామ్‌ల చుట్టూ తిరగకుండానే, నేరుగా UPI ద్వారా మీ లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోకి వేగంగా బదిలీ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
అయితే కొత్త పద్దతికి సంబంధించిన ప్రక్రియ వేగంగా జరుగుతుంది.. UPI ద్వారా పీఎఫ్ విత్‌డ్రా చేయడానికి అవసరమైన బ్యాక్-ఎండ్ సాఫ్ట్‌వేర్ మరియు సాంకేతిక వ్యవస్థను EPFO ఇప్పటికే సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ట్రయల్స్ కూడా దాదాపుగా పూర్తయినట్లు సమాచారం.. అయితే ఈ కొత్త UPI విత్‌డ్రా సదుపాయాన్ని డిసెంబర్ 2026లో అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. మొదట దశలవారీగా ప్రారంభించి, ఫిబ్రవరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అందరు ఖాతాదారులకు పూర్తిస్థాయిలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని EPFO లక్ష్యంగా పెట్టుకుంది. EPFO తన సేవలను పూర్తిగా ఆధునీకరించడానికి, బ్యాంకింగ్ వ్యవస్థ తరహాలో వేగవంతం చేయడానికి తీసుకొస్తున్న మెగా అప్‌గ్రేడ్ పేరే EPFO 3.0. సామాన్య ఉద్యోగి ఆఫీసుల చుట్టూ తిరగకుండా, తన మొబైల్ నుండే అన్ని పనులు చేసుకునేలా దీన్ని డిజైన్ చేశారు. ఇక పోతే ఇప్పటికే EPFO ఇటీవలే ఖాతాదారుల సందేహాలు తీర్చడానికి, ప్రాథమిక సమాచారం అందించడానికి వాట్సాప్ ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చింది.
ఆటో-సెటిల్‌మెంట్ పరిమితులను పెంచిన తర్వాత, ఇప్పుడు ఏకంగా UPI ద్వారా నేరుగా నగదు ఉపసంహరించుకునే సౌకర్యాన్ని జత చేస్తోంది.దీనికి తోడూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, సాంకేతికత సహాయంతో క్షణాల్లో డబ్బులు ఖాతాలోకి చేరడం వల్ల అత్యవసర వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాల సమయంలో ఉద్యోగులకు పెద్ద ఊరట లభిస్తుంది.
ఇక డిసెంబర్‌లో ఈ సదుపాయం రాగానే మీరు ఎలాంటి ఆటంకం లేకుండా వాడుకోవాలంటే, ఇప్పటి నుండే ఈ 3 విషయాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి… మీ UAN నంబర్ యాక్టివ్‌గా ఉండి, దానికి మీ ఆధార్, పాన్ కార్డు వివరాలు పూర్తిగా వెరిఫై అయి ఉండాలి. మీ PF ఖాతాకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉందో, అదే బ్యాంక్ అకౌంట్ మీ మొబైల్‌లోని UPI యాప్‌కు లింక్ అయి ఉండాలి. OTP మరియు UPI వెరిఫికేషన్ కోసం మీ ఆధార్, బ్యాంక్ మరియు EPFO ఖాతాలో ఒకే మొబైల్ నంబర్ అప్‌డేట్ అయి ఉండటం చాలా ముఖ్యం. ఇక మొత్తానికి, ఒకప్పుడు నెలల తరబడి కాగితాల చుట్టూ తిరిగిన పీఎఫ్ వ్యవస్థ… ఇప్పుడు మన అరచేతిలోని UPI యాప్ వరకు రావడం నిజంగా గొప్ప మార్పు. డిసెంబర్‌లో ఈ సేవలు ప్రారంభమైతే, కోట్లాది మంది ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు అత్యవసర సమయాల్లో పెద్ద ఆర్థిక భరోసా దొరుకుతుంది.
