SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Air Indo Airlines Andhra Pradesh New Airline 2027

ఏపీ నుంచి కొత్త విమానయాన సంస్థ.. రూ.390 కోట్ల పెట్టుబడి! 2027లో టేకాఫ్..

  • Written By: Ayyappa Panja
  • Published Date - Tue - 24 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఏపీ నుంచి మరో కొత్త ఎయిర్ వేస్ సంస్థ.. రూ.390 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకబోతోంది. ‘ఎయిర్ ఇండో ఎయిర్‌లైన్స్’ పేరుతో కొత్త ప్రాంతీయ విమానయాన సంస్థ రంగంలోకి దిగుతోంది. కేవలం మెట్రో సిటీలకే పరిమితం కాకుండా, కనెక్టివిటీ తక్కువగా ఉన్న టైర్-2, టైర్-3 నగరాలను కలుపుతూ, రూ.390 కోట్ల భారీ పెట్టుబడితో ఈ సంస్థ పురుడు పోసుకుంటోంది. “కనెక్టింగ్ ఇండియా, యునైటింగ్ డ్రీమ్స్” అనే నినాదంతో గుంటూరు కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఎయిర్‌లైన్ 2027 మేలో టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. అసలు ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న విజన్ ఏంటి? ఏ విమానాలను వాడబోతున్నారు?

ఈ ఎయిర్ ఇండో ఎయిర్‌లైన్స్‌ను అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన శ్రీనివాస్ చిలుకూరి స్థాపించారు. డైరెక్టర్‌గా శిరీష కుమారి బాలపనూరుతో కలిసి ఆయన ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. గత రెండు దశాబ్దాల్లో దేశంలో ఏవియేషన్ సెక్టార్ వేగంగా ఎదిగినప్పటికీ, ఆ వృద్ధి పెద్ద నగరాలకే పరిమితమైందని, చిన్న నగరాలకు సరైన కనెక్టివిటీ లేదని శ్రీనివాస్ గుర్తించారు. ఆ లోటును తీర్చడానికే సుమారు రూ.390 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ముందుకు వచ్చారు. ఇక విమానాల విషయానికి వస్తే.. 72 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఏటీఆర్ 72-600 రకం ప్రాంతీయ విమానాలను వినియోగించాలని నిర్ణయించారు. గంటకు సుమారు 500 కిలోమీటర్ల వేగంతో, 1,500 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించగల ఈ విమానాలు, సాధారణ జెట్ విమానాలతో పోలిస్తే దాదాపు 40 శాతం తక్కువ ఇంధనాన్ని ఖర్చు చేస్తాయి. దీనివల్ల ఆపరేషనల్ కాస్ట్ తగ్గి, తక్కువ ధరల్లో టికెట్లు ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది.

ఎయిర్ ఇండో తన తొలి కార్యకలాపాలకు విజయవాడ విమానాశ్రయాన్ని ప్రధాన కేంద్రంగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది. ప్రారంభ దశలో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరాల మధ్య విమాన సర్వీసులు నడపాలని భావిస్తోంది. ఈ నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 45 నుంచి 60 నిమిషాల్లోపు ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. దీంతో బిజినెస్ పీపుల్, ఎంప్లాయీస్, స్టూడెంట్స్, అర్జెంట్ వర్క్స్ ఉన్నవారికి ఎంతో టైమ్ సేవ్ అవుతుంది. ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా 15కి పైగా నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం ఏపీ కారిడార్, గోవా కారిడార్, సెంట్రల్ ఇండియా కారిడార్ అంటూ మూడు కారిడార్లను ప్రతిపాదించారు. అంతేకాకుండా, తిరుపతి, షిర్డీ, వారణాసి, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ స్పిరిచువల్ టూరిజం రూట్లను కూడా నడపాలనే ఆలోచనలో ఉన్నారు.

Join Our Whatsapp Channel

మరి ఈ సంస్థకు అనుమతుల పరిస్థితి ఏంటని చూస్తే.. ఇప్పటికే కీలకమైన ప్రాథమిక ప్రక్రియలు పూర్తయ్యాయి. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి NOC, అలాగే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా వచ్చాయి. అయితే, వాణిజ్య సర్వీసులు మొదలుపెట్టడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి తుది అనుమతి, అంటే ఎయిర్ ఆపరేటర్ పర్మిట్ ఇంకా రావాల్సి ఉంది. తొలుత 2026 చివరి నాటికి ప్రారంభించాలనుకున్నా, ఇప్పుడు 2027 మే నెలను టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్యాసింజర్ సర్వీసులతో పాటు భవిష్యత్తులో ఎయిర్ కార్గో రంగంలోకి కూడా అడుగుపెట్టి, ప్రాంతీయ నగరాల మధ్య సరుకుల రవాణాకు అవకాశం కల్పించాలని దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకం రీజినల్ కనెక్టివిటీకి ఊతమిస్తున్న వేళ, గతంలో ఎయిర్ కోస్టా, డెక్కన్ ఎయిర్ వంటి సంస్థలు ఎదుర్కొన్న సవాళ్లను అధిగమిస్తూ ‘ఎయిర్ ఇండో’ నిలదొక్కుకునే విధంగా సంస్థ నిర్వాకులు ప్లాన్ చేస్తున్నారు.

Tags :

  • Air Indo Airlines
  • Air Travel
  • Andhra Pradesh
  • ATR 72-600
  • Aviation News
  • guntur
  • Hyderabad Flights
  • Indian Aviation
  • New Airlines
  • Regional Connectivity
  • Vijayawada Airport
  • Visakhapatnam
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏపీకి భారీ వర్ష సూచన.. మూడు రోజుల పాటు ఈదురుగాలులతో వానలు

ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు..

  • పార్టీని నమ్ముకున్న వారికే ప్రాధాన్యత..జనసేన డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్‌పర్సన్ల జాబితా విడుదల

    4 డిప్యూటీ మేయర్లు.. 17 వైస్ ఛైర్‌పర్సన్లు! జనసేన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే

  • రాప్తాడు ఘటన.. బాలిక ఇంటికి, నిందితుడు సబ్ జైలుకి

    రాప్తాడు నిందితుడు హేమంత్‌కు రిమాండ్!

  • సాక్షి ఎవరిది? షర్మిల వాటా సంగతేంటి?

    సాక్షి ఎవరిది? షర్మిల వాటా సంగతేంటి?

  • ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్..

    ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • యోగరాజ్ సింగ్ వ్యాఖ్యలపై పృథ్వీ షా ఫైర్..

  • ఏపీ నుంచి కొత్త విమానయాన సంస్థ.. రూ.390 కోట్ల పెట్టుబడి! 2027లో టేకాఫ్..

  • ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. చాక్లెట్ ఫ్యాక్టరీలో మంటలు.. 24 మంది మృతి!

  • పిక్నిక్‌కు వెళ్లిన బాలుడికి విషాదాంతం.. ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి!

  • బంగారం ధరలు తగ్గడంతో బ్యాంకుల నుంచి నోటీసులు..

  • విద్యార్థినికి అసభ్య మెసేజ్‌లు.. లెక్చరర్‌కు దేహశుద్ధి!

  • లోగో డిజైన్ చేస్తే రూ.1 లక్ష ప్రైజ్ మనీ.. గోదావరి పుష్కరాలు 2027 కోసం బంపర్ ఆఫర్!

Most viewed

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam