స్థానిక సంస్థల పదవుల భర్తీపై జనసేన పార్టీ కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్రంలోని 4 మున్సిపల్ కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లు, అలాగే 17 మున్సిపాలిటీలకు వైస్ ఛైర్‌పర్సన్ల అభ్యర్థులను ఖరారు చేస్తూ జనసేన పార్టీ అధికారిక జాబితాను విడుదల చేసింది. పార్టీ అధిష్టానం ప్రకటించిన ఈ జాబితాలో ఏయే ప్రాంతాల నుంచి ఎవరికి అవకాశం దక్కింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.”
ఏపీలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో తమ పార్టీకి దక్కిన పదవుల భర్తీకి జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ జాబితాను విడుదల చేశారు. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్ అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. కీలకమైన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా పందిరి వెంకట శివప్రసాద్ పేరును ఖరారు చేశారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా కొట్టె వెంకటరావుకు అవకాశం కల్పించారు.ఆధ్యాత్మిక నగరం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా పాలడుగు విజయ ఎంపికయ్యారు. ఇక గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎర్రంశెట్టి రాజేష్ పేరును జనసేన పార్టీ ప్రకటించింది.
నాలుగు కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపాలిటీలకు వైస్ ఛైర్‌పర్సన్ల అభ్యర్థులను కూడా జనసేన పార్టీ ఖరారు చేసింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు వివిధ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులకు సముచిత స్థానం కల్పిస్తూ ఈ జాబితాను రూపొందించారు. ముందుగా ఉత్తరాంధ్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో చూస్తే..పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీకి వడరేవు అశోక్, నర్సీపట్నం మున్సిపాలిటీకి అడ్డెపల్లి సౌజన్య పేర్లను ఖరారు చేశారు. ఇక పిఠాపురం మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌గా బొజ్జా వెంకటేశ్వరరావు, గొల్లప్రోలు మున్సిపాలిటీకి ఎన్నేటి అప్పారావు, రామచంద్రాపురం మున్సిపాలిటీకి కావాల నారాయణ మూర్తి ఎంపికయ్యారు.
ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీల విషయానికి వస్తే… ఆకివీడు మున్సిపాలిటీకి తోట శ్రీనివాసరావు,
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి బండరాల నరేశ్‌కుమార్ పేర్లను ఖరారు చేశారు. ఉయ్యూరు మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌గా గంటా గంగా భవాని,
జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కొలగాని రాము, కొండపల్లి మున్సిపాలిటీకి **అక్కల రామ్మోహన్ రావులను పార్టీ ఎంపిక చేసింది. అలాగే రేపల్లె మున్సిపాలిటీకి వడ్డి నాగ మారుతి కుమారి, సత్తెనపల్లి మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా మామిడి దివ్య వాణి పేర్లను ప్రకటించారు.”
ఇక ప్రకాశం, నెల్లూరు రాయలసీమ జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలలో కూడా అభ్యర్థులను ఖరారు చేశారు. మార్కాపురం మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌గా కొప్పుల నాగ జ్యోతి,నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీకి కె.శిరీష ఎంపికయ్యారు. రాయలసీమ ప్రాంతంలోని రాయదుర్గం మున్సిపాలిటీకి మహబూబ్ బాషా,
పలమనేరు మున్సిపాలిటీకి సయ్యద్ మురాదు, మైదుకూరు మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌గా వదనపల్లి శాంత కుమారి పేర్లను జనసేన పార్టీ ప్రకటించింది.
మొత్తంగా 4 కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లు, 17 మున్సిపాలిటీలకు వైస్ ఛైర్‌పర్సన్ల పేర్లను జనసేన అధిష్టానం ప్రకటించింది. సామాజిక సమీకరణాలు, పార్టీ కోసం పనిచేసిన తీరును పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపికలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
