పవన్ కళ్యాణ్‌కు అతని ఫ్యాన్స్‌కు భారీ షాక్ తగిలింది. నార్త్ అమెరికాలోని చాలా థియేటర్లలో ఓజీ విడుదల కావడం లేదు. థియేటర్ల ఛైన్‌గా ప్రసిద్ధికెక్కిన యార్క్ సినిమాస్ అధికారింగా ఈ విషయాన్ని ప్రకటించింది. సినిమా కలెక్షన్ల విషయంలో కూడా తప్పుడు సమాచారం వెళ్లిందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన ఓజీ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ […]
సినిమా టిక్కెట్ల పెంపు విషయంలో టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయమే సరైందని స్పష్టం చేశారు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రీమియర్ షో ధరలు భారీగా పెంచుకునేందుకు […]
దాదాపుగా 4 దశాబ్దాల క్రితం తెలుగు సినిమాను ఓ ఊపు ఊపిన సినిమాగా, యువతను ప్రేరేపించిన శివ చెప్పవచ్చు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా నాగార్జున కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అనడంతో సందేహం లేదు. ఇప్పుడీ సినిమా రీ రిలీజ్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శివ సినిమాకు ప్రత్యేక స్థానముంది. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ సినిమా నిర్మాణ శైలిని శివకు ముందు..శివకు తరువాతగా చెప్పడం ప్రారంభించారు. […]
పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అయిన రష్మికా మందన్నాకు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. బాలీవుడ్‌లో అయితే భారీ అవకాశాలే లభిస్తున్నాయి. ఇప్పుడు మరో బాలీవుడ్ సీక్వెల్ కోసం రష్మికను సంప్రదించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో ఆమెకు బాగా పాపులారిటీ సంపాదించుకుంది. నేషనల్ క్రష్ అంటూ పిల్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆమెకు […]
కోలీవుడ్ ప్రముఖ కమెడియన్‌ను కోల్పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమిళ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూశారు. రోబో శంకర్ మృతి పట్ల చిత్ర ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్న రోబో శంకర్ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈయన వయసు 46 ఏళ్లు. మూడ్రోజుల క్రితం ఒక్కసారిగా అస్వస్థతకు గురై మూర్ఛపోవడంతో వెంటనే చెన్నైలోని […]
జయం సినిమాతో పాపులారిటీ సంపాదించుకుని సినిమా రంగంలో కమెడియన్‌గా నిలిచిన సుమన్ శెట్టి ఇప్పుుడు బిగ్‌బాస్‌తో మళ్లీ కెరీర్ ప్రారంభించాడు. తాజాగా ఇతడి గురించి టాలీవుడ్ దర్శకుడు తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీ కోసం.. టాలీవుడ్ మేటి దర్శకుడు తేజ గురించి తెలియనివాళ్లుండరు. ఎందరో కొత్త ఆర్టిస్టులకు అవకాశం కల్పించారు. అలాంటివారిలో ఒకడు కమెడియన్ సుమన్ శెట్టి. జయం సినిమాతో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన సుమన్ శెట్టికి ఆ తరువాత చాలా అవకాశాలు […]
టాలీవుడ్..బాలీవుడ్, కోలీవుడ్ ఏ చలన చిత్ర పరిశ్రమను తీసుకున్నా హీరోయిన్ల వ్యాలిడిటీ చాలా తక్కువ. ఎంత వయసు వచ్చినా హీరోలకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. హీరోయిన్లకు మాత్రం పదేళ్లు కూడా ఉండకపోవచ్చు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా ఒకే కుటుంబంలో నలుగురితో కలిసి నటించింది. ఆ వివరాలు మీ కోసం. వెండితెర ఏదైనా సరే హీరోయిన్లు ప్రతి 7-8 ఏళ్లకు ఫేడ్ అయిపోతుంటారు. కొత్త తరం వస్తుంటుంది. హీరోలు మాత్రం అలా కాదు. 50-60 ఏళ్లు […]
ఇటీవల వైరల్ అయిన శ్రీలీల వయ్యారి పాట గురించి వినే ఉంటారు. ఈ సినిమా ధియేటర్‌లో మిస్ అయుంటే నో టెన్షన్. త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో సెప్టెంబర్ 19 నుంచి విడుదల కావచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ నటి శ్రీలీల హీరోయిన్‌గా ప్రముఖ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమైన జూనియర్ సినిమా ధియేటర్‌లో ఫరవాలేదన్పించింది. సూపర్‌హిట్ కాకపోయినా యావరేజ్ […]
పాన్ ఇండియా సినిమా కల్కి సీక్వెల్‌పై షాకింగ్ ట్విస్ట్. స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించడంతో అభిమానులకు నిరాశ చెందుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభాస్-దీపికా పదుకోణ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి సినిమా భారీ విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకోణ్ పాత్ర అందర్నీ ఆకర్షించడంతో సహజంగానే […]
సూపర్‌స్టార్ మహేశ్ బాబు-రాజమౌళి సినిమా తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అప్పుడే అప్‌డేట్ వచ్చింది. అధికారికంగా ప్రకటన రాకపోయినా దాదాపుగా నిర్ధారణైనట్టు సమాచారం. విభిన్న కథాంశాలు ఎంచుకునే ఆ దర్శకుడు మహేశ్ బాబుకు ఏ స్టోరీ లైన్ చెప్పారనేది ఆసక్తిగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ సినిమా SSMB29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి సినిమా కావడంతో రెండేళ్ల వరకు మహేశ్ బాబు ఫుల్ బిజీ అని […]