బాలీవుడ్ స్టార్ నటి, పవన్ కళ్యాణ్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ స్టార్ హీరోతో ఒక్క రాత్రి గడపడానికైనా తాను సిద్ధమేనని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కహోనా ప్యార్ హై చిత్రంతో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన అమీషా పటేల్ టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పరమ వీరచక్ర సినిమాల్లో నటించింది. హిందీలో స్టార్ నటిగా ముద్ర వేసుకున్న అమీషా పటేల్‌కు తెలుగులో మాత్రం ఇప్పటికీ పవన్ కళ్యాణ్ హీరోయిన్‌గానే పిలుస్తారు. బద్రి సినిమాలో రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్‌తో పాటు నటించి మెప్పించింది. ఇటీవల ఓ పోడ్ కాస్ట్‌కు హాజరైన అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కెరీర్ గురించి, తన వ్యక్తిగత ఇష్టాల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్న ఈ 50 ఏళ్ల నటి ఓ హీరో గురించి వ్యాఖ్యలు చేసింది.
పవన్ కళ్యాణ్ హీరోయిన్‌గా ముద్రపడిన ఈమెకు హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ అంటే చచ్చేంత ఇష్టమట. ఎవరైనా టామ్ క్రూజ్‌తో పోడ్ కాస్ట్ చేస్తే తనను పిలవమంటోంది. చిన్నప్పటి నుంచి తనకు టామ్ క్రూజ్ అంటే చాలా ఇష్టమని, తన గదిలో ఉన్న ఏకైక పోస్టర్ అతనిదేనంటోంది. టామ్ క్రూజ్ ఇప్పటికీ ఎప్పటికీ తన క్రష్ అంటోంది. అవకాశం వస్తే పెళ్లి చేసుకుంటానంటోంది. అంతేకాదు..ఒక రాత్రి గడిపేందుకు అవకాశం వస్తే వెనుకాడనని చెబుతూ సంచలనం రేపింది. కారణమేంటో తెలియదు కానీ అతడంటే పడిఛస్తానంటోంది. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని, సరైన వ్యక్తి దొరికితే చేసుకుంటానని చెబుతోంది. హిందీలో చాలాకాలం విరామం తరువాత గదర్ 2 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.