దాదాపుగా 4 దశాబ్దాల క్రితం తెలుగు సినిమాను ఓ ఊపు ఊపిన సినిమాగా, యువతను ప్రేరేపించిన శివ చెప్పవచ్చు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా నాగార్జున కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అనడంతో సందేహం లేదు. ఇప్పుడీ సినిమా రీ రిలీజ్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శివ సినిమాకు ప్రత్యేక స్థానముంది. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ సినిమా నిర్మాణ శైలిని శివకు ముందు..శివకు తరువాతగా చెప్పడం ప్రారంభించారు. […]
పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అయిన రష్మికా మందన్నాకు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. బాలీవుడ్‌లో అయితే భారీ అవకాశాలే లభిస్తున్నాయి. ఇప్పుడు మరో బాలీవుడ్ సీక్వెల్ కోసం రష్మికను సంప్రదించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో ఆమెకు బాగా పాపులారిటీ సంపాదించుకుంది. నేషనల్ క్రష్ అంటూ పిల్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆమెకు […]
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉంది. మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బంగాళాఖాతంలో వాతావరణం ప్రతికూలంగా మారుతోంది. ఈ నెల 24 తరువాత ఏర్పడనున్న ఉపరితల ద్రోణి క్రమంగా అల్పపీడనంగా మారి ఆ తరువాత వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 26 నాటికి వాయుగుండంగా మారి ఆ […]
స్కూల్ విద్యార్ధులకు శుభవార్త. దసరా సెలవులు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు దసరా సెలవులు మరో రెండు రోజులు పెరగడంతో విద్యార్ధులు ఆనందంతో ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్కూల్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. దసరా సెలవుల తేదీల్లో మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. తొలుత ప్రకటించిన దానికంటే అదనంగా మరో రెండ్రోజులు సెలవులు పొడిగించారు. విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోరిక మేరకు సెలవులు పొడిగించినట్టు […]
ఓటీటీ ప్రేమికులకు బిగ్ అప్‌డేట్. ఈ వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ధియేటర్లలో ఈ వారం పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఓటీటీ వీక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కలగనుంది. ఏ ఓటీటీలో ఏ సినిమా లేక వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం. ఓటీటీలకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. అందుకే కొన్ని నేరుగా ఓటీటీలో విడుదలవుతుంటే, మిగిలినవి ధియేటర్ రిలీజ్ తరువాత ఓటీటీలో వచ్చేస్తున్నాయి. గత వారం ధియేటర్లలో విడుదలై మంచి ఆదరణ సంపాదించుకున్న మిరాయ్, […]
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 అప్పుడే రెండో వారం ఎలిమినేషన్స్‌కు చేరువైంది. నామినేషన్లలో ఉన్నవాళ్లు గట్టెక్కేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటింగ్ సరళి చూస్తుంటే ఈసారి ఆ కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్లిపోక తప్పదని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వారం కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ కాగా రెండో వారం నామినేషన్ ప్రక్రియ గట్టిగా జరిగింది. నామినేషన్ సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య వాదోపవాదనలు జరిగాయి. హౌస్‌మేట్స్ మధ్య […]
కోలీవుడ్ ప్రముఖ కమెడియన్‌ను కోల్పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమిళ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూశారు. రోబో శంకర్ మృతి పట్ల చిత్ర ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్న రోబో శంకర్ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈయన వయసు 46 ఏళ్లు. మూడ్రోజుల క్రితం ఒక్కసారిగా అస్వస్థతకు గురై మూర్ఛపోవడంతో వెంటనే చెన్నైలోని […]
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చనుంది. ఆ తరువాత వాయుగుండంగా మారవచ్చు. ఈ క్రమంలో రానున్న 4 రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం దేశమంతా భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో కూడా వర్షాలు వీడటం లేదు. కొన్ని ప్రాంతాల్లో విరామం లేకుండా కుండపోత వర్షాలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. […]
జయం సినిమాతో పాపులారిటీ సంపాదించుకుని సినిమా రంగంలో కమెడియన్‌గా నిలిచిన సుమన్ శెట్టి ఇప్పుుడు బిగ్‌బాస్‌తో మళ్లీ కెరీర్ ప్రారంభించాడు. తాజాగా ఇతడి గురించి టాలీవుడ్ దర్శకుడు తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీ కోసం.. టాలీవుడ్ మేటి దర్శకుడు తేజ గురించి తెలియనివాళ్లుండరు. ఎందరో కొత్త ఆర్టిస్టులకు అవకాశం కల్పించారు. అలాంటివారిలో ఒకడు కమెడియన్ సుమన్ శెట్టి. జయం సినిమాతో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన సుమన్ శెట్టికి ఆ తరువాత చాలా అవకాశాలు […]
టాలీవుడ్..బాలీవుడ్, కోలీవుడ్ ఏ చలన చిత్ర పరిశ్రమను తీసుకున్నా హీరోయిన్ల వ్యాలిడిటీ చాలా తక్కువ. ఎంత వయసు వచ్చినా హీరోలకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. హీరోయిన్లకు మాత్రం పదేళ్లు కూడా ఉండకపోవచ్చు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా ఒకే కుటుంబంలో నలుగురితో కలిసి నటించింది. ఆ వివరాలు మీ కోసం. వెండితెర ఏదైనా సరే హీరోయిన్లు ప్రతి 7-8 ఏళ్లకు ఫేడ్ అయిపోతుంటారు. కొత్త తరం వస్తుంటుంది. హీరోలు మాత్రం అలా కాదు. 50-60 ఏళ్లు […]