ఇటీవల వైరల్ అయిన శ్రీలీల వయ్యారి పాట గురించి వినే ఉంటారు. ఈ సినిమా ధియేటర్‌లో మిస్ అయుంటే నో టెన్షన్. త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో సెప్టెంబర్ 19 నుంచి విడుదల కావచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టాలీవుడ్ స్టార్ నటి శ్రీలీల హీరోయిన్‌గా ప్రముఖ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా పరిచయమైన జూనియర్ సినిమా ధియేటర్‌లో ఫరవాలేదన్పించింది. సూపర్‌హిట్ కాకపోయినా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కళాశాల నేపధ్యంతో సాగే ఈ సినిమాలో నచ్చని వ్యక్తితో నచ్చని ఊరికి వెళ్లడం, అక్కడ ఏం జరుగుతుంది, ఏమౌతుందనేదే సినిమా స్టోరీ. జెనీలియా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నా ఇప్పటి వరకూ స్ట్రీమింగ్ ఎప్పుడనేది ప్రకటించలేదు. ఈ సినిమా ధియేటర్‌లో విడుదలై అప్పుడే రెండు నెలలు దాటేసింది.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తేదీ ప్రకటించకపోయినా ఆహా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబర్ 19 అంటే ఈ శుక్రవారం ఆహాలో స్ట్రీమింగ్ కావచ్చని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఎప్పుడు వస్తుందనేది ఇంకా తెలియలేదు. ఆహా, అమెజాన్ ప్రైమ్‌లో ఒకేసారి స్ట్రీమింగ్ అయినా ఆశ్చర్యం లేదు.