కేరళ అందాల కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన పరదా సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసింది. అటు తేజ సజ్జా సినిమా మిరాయ్ ఓటీటీ కూడా ఖరారైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్‌లో ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన పరదా సినిమా ఫరవాలేదన్పించింది. గత నెల 22న విడుదలైన ఈ సినిమా అప్పుడే ఓటీటీలో వచ్చేసింది. ఏ మాత్రం చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా ఓటీటీలో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రాజేంద్ర ప్రసాద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇతరులు కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా గ్రామాల్లో మహిళలపై ఉన్న ఆంక్షలు, ఆచారాల నేపధ్యంలో తీశారు. ధియేటర్‌లో విడుదలై నెల రోజులు కాకుండానే అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
ఇక యువ హీరో తేజా సజ్జా నటించిన మిరాయ్ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, జపనీస్ భాషల్లో విడుదలైన సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదొక యాక్షన్ డ్రామా నేపధ్యంలో సాగే సినిమా. ఈ క్రమంలో సినిమా ఓటీటీ హక్కుల విషయంలో స్పష్టత వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని 40 కోట్లకు దక్కించుకుంది. నిబంధనల ప్రకారం ధియేటర్‌లో విడుదలైన 8 వారాల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కచ్చితంగా ఏ తేదీ నుంచనదేది అధికారికంగా జియో హాట్‌స్టార్ లేదా చిత్ర నిర్మాతలు ప్రకటిస్తారు.
కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందించగా శ్రియా, మంచు మనోజ్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. సినిమా నాన్ ధియేట్రికల్ రైట్స్ ద్వారానే 50 కోట్లు ఆర్జించింది.