లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్రేజ్ తగ్గిపోయిన తరుణంలో కొత్త లోక.. కొత్త చరిత్ర సృష్టించింది. కళ్యాణి ప్రియదర్శిని లీడ్ రోల్‌లో వచ్చిన ఈ సినిమా అప్పుడే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిన్న మొన్నటి వరకూ మీడియాలో పెద్గగా టాక్ లేని సినిమా ఇది. కళ్యాణి ప్రియదర్శిని లీడ్ రోల్ పోషించగా సల్మాన్ దుల్కర్ నిర్మించిన ఈ సినిమా ఊహించని రీతిలో దూసుకుపోతోంది. కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసేసింది. మాలీవుడ్‌లో ఇంత వేగంగా వంద కోట్లు వసూలు చేసిన సినిమాల్లో ఎల్ 2 ఎంపురాన్, తుడరమ్ తరువాత ఇదే. మలయాళంలో లోక పేరుతో తెలుగులో కొత్త లోక పేరుతో విడుదలైంది. తెలుగులో కూడా ఏకంగా 6 కోట్ల వరకూ వసూలు చేసింది.
ఫీమేల్ లీడ్ రోల్ సినిమాలు వంద కోట్ల క్లబ్‌లో చేరడం చాలా కాలం తరువాత ఇదే. గతంలో మహానటి 84 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం లాభాల్లో ఉన్న కొత్త లోక సినిమా మహానటి, రుద్రమదేవి, అరుంధతి, భాగమతి సినిమాల కంటే అత్యధికంగా వసూళ్లు జరిపింది. కేరళలో అయితే ఈ సినిమా మరి కొన్ని రోజులు ఇలాగే కలెక్షన్లు రాబడుతుంది. తెలుగులో అయితే ఈ వారంలో లిటిల్ హార్ట్స్, మదరాసి, ఘాటీ విడుదల కానున్నాయి. ఈ వారం కూడా కొత్త లోక కలెక్షన్లు ఇలానే ఉంటే కచ్చితంగా మరో రికార్డు సృష్టిస్తుంది.