సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఇంటర్నేషనల్ ప్రాజెక్టు SSMB 29 గురించి క్రేజీ అండ్ బిగ్ అప్‌డేట్ వెలువడింది. ఈ అప్‌డేట్ ఏంటో తెలిస్తే ఫ్యాన్స్ ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు-ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న అంతర్జాతీయ స్థాయి సినిమా SSMB 29 గురించి కీలకమైన అప్‌డేట్ వచ్చింది. ఈ అప్‌డేట్ స్వయంగా కెన్యా దేశపు మంత్రి వెల్లడించారు. దేశ విదేశాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడీ అప్‌డేట్ తెలిస్తే అంచనాలు మరింతగా పెరగడం ఖాయం. వాస్తవానికి మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో SSMB 29 ప్రకటన వచ్చినప్పటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాన్స్ మతి పోయే అప్‌డేట్ వచ్చేసింది.
కెన్యా దేశపు మంత్రి ముసాలియా ముదావాది ట్వీట్ ద్వారా కొన్ని ఫోటోలతో పాటు కీలకమైన సమాచారం అందించారు. అందుకే ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ సారాంశం ఏంటంటే రాజమౌళి-మహేశ్ బాబు సినిమా షూటింగ్ ఎన్ని దేశాల్లో జరుగుతుంది, ఎన్ని దేశాల్లో విడుదల కానుందనేది. ఈ సినిమాను ఏకంగా 120 దేశాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని రాజమౌళి చెప్పారని కెన్యా మంత్రి ముసాలియా ముదావాది ట్వీట్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. అంత భారీ స్థాయిలో ఈ సినిమా వస్తుందని అభిమానులు అస్సలు ఊహించలేదు. 120 మందితో కూడిన రాజమౌళి టీమ్ తూర్పు ఆఫ్రికా ఖండమంతా పర్యటించి చివరికి షూటింగ్ కోసం తమ దేశం ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మసాయి మరా మైదానాల నుంచి అత్యంత అందమైన నైవాషా, ఐకానిక్ అంబోసెలి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి ఈ సినిమా చేరుకుంటుందని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు.
తమ దేశంలోని అందాలను, ఆతిధ్యాన్ని, అందమైన దృశ్యాల్ని చూపించడంతో సినిమా శక్తివంతంగా పనిచేస్తుందని కెన్యా మంత్రి చెప్పారు. కెన్యాలో ఇవాళ్టి నుంచి రాజమౌళి-మహేశ్ బాబు కాంబో సినిమా SSMB 29 షూటింగ్ జరగనుంది. అభిమాన హీరో సినిమా భారీగా 120 దేశాల్లో విడుదల కానుందని తెలిసి అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు