బిగ్‌బాస్ తెలుగు ప్రేక్షకుల నిరీక్షణకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నవారికి బిగ్ అప్‌డేట్ ఇది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 లాంచింగ్ డేట్ వచ్చేసింది. ఈ మేరకు ప్రోమో కూడా విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బుల్లితెరపై అతి పెద్ద రియాల్టీ షోగా ఉన్న బిగ్‌బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 9కు సిద్ధమైంది. మరోసారి కింగ్ నాగార్జున హోస్ట్ చేయనున్నారు.ఇప్పటికే 8 సీజన్లు పూర్తి కాగా ఇప్పుడు 9వ సీజన్ లాంచ్ డేట్ అధికారికంగా ప్రకటించింది బిగ్‌బాస్ యాజమాన్యం. ఈసారి చదరంగం కాదు రణరంగమంటూనే..డబుల్ హౌస్ డబుల్ ధమామా గ్యారంటీ అంటున్నారు నాగార్జున.
అంతేకాదు ఈసారి బిగ్‌బాస్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐదుగురు సామాన్యులకు ప్రవేశం ఉంటుంది. ఈ సామాన్యుల ఎంపిక కోసం శ్రీముఖి హోస్ట్‌గా నవదీప్, బిందు మాధవి, అభిజీత్‌లు న్యాయనిర్ణేతలుగా అగ్నిపరీక్ష గత 3-4 వారాలుగా జరుగుతోంది. వందలాది అప్లికేషన్ల నుంచి తొలి దశలో 40 మందిని ఎంపిక చేశారు. ఆ తరువాత వివిధ టాస్క్‌లు, పరీక్షల ద్వారా టాప్ 15 జాబితా సిద్ధం చేశారు. ఇప్పుడు ఈ టాప్ 15 నుంచి హౌస్‌లోకి వెళ్లేవారిని ప్రేక్షకుల ఓట్ల ద్వారా నిర్ణయిస్తారు. ఎంతమంది అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
వచ్చే వారమే లాంచ్, సెప్టంబర్ 7 నుంచి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7న లాంచ్ కానుందని బిగ్‌బాస్ యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రోమో కూడా విడుదల చేసింది. అంటే మరో వారం రోజుల్లో షో ప్రారంభం కానుంది. ముందుగా చెప్పినట్టే రెండు హౌస్‌లు ఉంటాయి. ఒకటి సెలెబ్రిటీ హౌస్ కాగా రెండవది కామన్ మ్యాన్ హౌస్.