అందాలతార నయనతారకు సినిమాల ఎంపిక విషయంలో నిక్కచ్చిగా ఉంటుంది. అందుకే 100 కోట్లిచ్చినా ఆ హీరోతో నటించనని తెగేసి చెప్పేసింది. ఇప్పుడా హీరో సరసన టాలీవుడ్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా పిల్చుకునే నయనతారకు గట్స్ ఎక్కువే. సినిమాల ఎంపిక విషయంలో, హీరోల విషయంలో మొహమాటం లేకుండా ఉంటుంది. అందుకే ఆ తమిళ హీరోతో నటించనని తెగేసి చెప్పేసింది. 100 కోట్ల పారితోషికం ఇచ్చినా నటించనంది. నయనతార తిరస్కరించిన ఆ హీరో మరెవరో కాదు..వ్యాపారం నుంచి సినిమా రంగంలో ప్రవేశించి లెజెండ్ పేరుతో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శరవణన్. వయసు 50 దాటిన తరువాత సినిమా హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో చాలా విమర్శలు, ట్రోలింగ్ ఎదురయ్యాయి. అయినా ఇప్పుడు రెండో సినిమాకు సిద్ధమౌతున్నాడు శరవణన్. ఈ రెండో సినిమాకే నయనతారను తీసుకోవాలనుకుంటే ఆమె కాస్తా నిరాకరించింది. ఇప్పుడు నయనతార స్థానంలో టాలీవుడ్ హీరోయిన్ పేరు విన్పిస్తోంది.
యాక్షన్ రొమాంటిక్ జానర్ కథాంశంగా శరవణన్ రెండవ సినిమా రూపుదిద్దుకోనుంది. షూటింగ్ కూడా ప్రారంభమైనట్టు సమాచారం. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్‌ను శరవణన్ సరసన ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో ప్రేక్షకుల్ని మరోసారి తనవైపుకు ఆకర్షించేందుకు పాయల్ ప్రయత్నిస్తోంది. ఈ హాట్ బ్యూటీ ఈ సినిమాలో ఏ మేరకు అందాలు ఆరబోయనుందో చూడాలి. తమిళనాడులో ప్రాచుర్యం పొందిన శరవణన్ స్టోర్స్ అధినేత శరవణన్ బ్రాండ్ యాడ్స్‌లో ప్రముఖ హీరోయిన్లతో కలిసి నటించాడు. ఇప్పుడు రెండో సినిమాతో బిజీగా ఉన్నాడు.