బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మూడో వారం ఎలిమినేషన్ సమీపించింది. అందరూ ఊహిస్తున్నట్టుగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందో లేదో ఇంకా క్లారిటీ లేకపోయినా ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఉన్నారని తెలుస్తోంది. సేఫ్ జోన్‌లో ఎవరున్నారు, ఎవరు హౌస్ నుంచి బయటకు రానున్నారో తెలుసుకుందాం.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో ప్రస్తుతం ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ మద్య పోరు రసవత్తరంగా నడుస్తోంది. మొదటి రెండు వారాలు కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ, కామనర్ మనీష్ హౌస్ నుంచి బయటకు రాగా ఇప్పుడు మూడో వారం ఎలిమినేషన్ కోసం ఓటింగ్ నడుస్తోంది. ఇవాళ్టితో ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. ఈ క్రమంలో నామినేషన్‌లో ఉన్నవారిలో ఎవరు సేఫ్ జోన్‌లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారో దాదాపుగా స్పష్టమౌతోంది. రీతూ చౌదరి, హరిత హరీషన్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కళ్యాణ్, ఫ్లోరా శైనిలు నామినేషన్‌లో ఉన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అంచనాల ప్రకారం ఈ వారం ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఓటింగ్ ప్రక్రియలో మొదటి స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇతనికి దాదాపుగా 27 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఫ్లోరా శైని 25.71 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు ఈమెకు ఇమ్యూనిటీ కూడా లభించడంతో ఈ వారం సేఫ్ అయినట్టే. మూడో స్థానంలో 14.53 శాతం ఓట్లతో కళ్యాణ్ నిలవగా మాస్క్ మ్యాన్ హరీష్ 13.3 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఈ క్రమంలో రీతూ చౌదరి 11.98 శాతం ఓట్లలో ఐదవ స్థానంలో ఉంటే అందరికంటే తక్కువగా 8.55 శాతం ఓట్లతో ప్రియా శెట్టి ఆరో స్థానంలో ఉంది. ఈ క్రమంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈ ఇద్దరూ హౌస్ నుంచి బయటకు రావచ్చు. సింగిల్ ఎలిమినేషన్ కొనసాగితే మాత్రం ప్రియా శెట్టి పూర్తిగా డేంజన్ జోన్‌లో ఉన్నట్టే. కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు, వివాదాలు ఎలిమినేషన్ ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు ఈ వారం ప్రారంభంలో ఓ కామనర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా ఈ వారం కూడా మరో కామనర్ రావచ్చనే అంచనాలున్నాయి.