బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 అప్పుడే రెండో వారం ఎలిమినేషన్స్‌కు చేరువైంది. నామినేషన్లలో ఉన్నవాళ్లు గట్టెక్కేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటింగ్ సరళి చూస్తుంటే ఈసారి ఆ కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్లిపోక తప్పదని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వారం కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ కాగా రెండో వారం నామినేషన్ ప్రక్రియ గట్టిగా జరిగింది. నామినేషన్ సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య వాదోపవాదనలు జరిగాయి. హౌస్‌మేట్స్ మధ్య గొడవలు కూడా జరిగాయి. ఈసారి నామినేషన్లలో మర్యాద మనీష్, హరిత హరీష్, ప్రియా శెట్టి, డిమాన్ పవన్, భరణి, ఫ్లోరా సైని, సుమన్ శెట్టి ఉన్నారు. కారణం తెలియకపోయినా ఈ కంటెస్టెంట్లలో సుమన్ శెట్టికి ఓట్లు భారీగా పడుతున్నాయి. ప్రస్తుతం ఇతని ఓటింగులో టాప్‌లో ఉన్నాడని సమాచారం. ఇక డిమాన్ పవన్ రెండోవారం కెప్టెన్ కావడంతో ఎలిమినేట్ అయ్యే పరిస్థితి లేదు.
సుమన్ శెట్టి తరువాత భరణి, హరిత హరీష్, ఫ్లోరా శైనిలకు ఓట్లు బాగా పడుతున్నాయి. భరణి ఆటతీరు బాగుంది. అన్ని టాస్క్‌లు అద్భుతంగా చేస్తున్నాడు. ఓటింగ్ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితిని బట్టి అంచనా వేస్తే ప్రియా శెట్టి, మనీష్ చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రియా శెట్టి కంటే మనీష్ ఇంకాస్త వెనుకంజలో ఉన్నాడు. ఈ క్రమంలో ఈవారం హౌస్ నుంచి మనీష్ ఎలిమినేట్ అయ్యే పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది.