టాలీవుడ్..బాలీవుడ్, కోలీవుడ్ ఏ చలన చిత్ర పరిశ్రమను తీసుకున్నా హీరోయిన్ల వ్యాలిడిటీ చాలా తక్కువ. ఎంత వయసు వచ్చినా హీరోలకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. హీరోయిన్లకు మాత్రం పదేళ్లు కూడా ఉండకపోవచ్చు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా ఒకే కుటుంబంలో నలుగురితో కలిసి నటించింది. ఆ వివరాలు మీ కోసం.
వెండితెర ఏదైనా సరే హీరోయిన్లు ప్రతి 7-8 ఏళ్లకు ఫేడ్ అయిపోతుంటారు. కొత్త తరం వస్తుంటుంది. హీరోలు మాత్రం అలా కాదు. 50-60 ఏళ్లు వచ్చినా ఇంకా మెరుస్తూనే ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే హీరోయిన్లకు వ్యాలిడిటీ ఉంటుంది. గతంలో 15-20 ఏళ్లు ఉన్న వ్యాలిడిటీ ఇప్పుడు పడిపోయింది. గరిష్టంగా 7-8 ఏళ్లు ఉంటుంది. అందుకే తెరపై హీరోలు మారకపోయినా హీరోయిన్లు మారిపోతుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఇంకా నటిస్తూనే ఉంది. పాత్ర మారవచ్చు కానీ నటన మాత్రం మానలేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏకంగా 20 ఏళ్లుగా నటిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలతో కలిసి నటించింది. అంటే నలుగురితో కలిసి వేర్వేరు సినిమాల్లో కన్పించింది.
ఈ సీనియర్ నటి మరెవరో కాదు అందాల భామ రమ్యకృష్ణ. దర్శకుడు కోడి రామకృష్ణతో పెళ్లయినా ఇంకా నటనకు మాత్రం స్వస్తి చెప్పలేదు. 13 ఏళ్ల వయస్సుకే 1983లో తమిళ దర్శకుడు తెరకెక్కించిన వెళ్లై మనసుతో సినిమాతో డెబ్యూ ఇచ్చింది. తెలుగులో మొదటి సినిమా 1986లో వచ్చిన భలే మిత్రులు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ ఇలా అందరితో నటించిన ఘనత ఆమె సొంతం. అన్నింటికంటే ముఖ్యంగా అక్కినేని కుటుంబంలో అందరితో నటించిన ఘనత ఉంది.
అక్కినేని నాగేశ్వరరావుతో దాగుడు మూతల దాంపత్యం, ఇద్దరే ఇద్దరు, సూత్రధారులు సినిమాలు చేయగా అతని కుమారుడు నాగార్జునతో హలో బ్రదర్, చంద్రలేఖ్, అన్నమయ్య, అల్లరి అల్లుడు వంటి 10 సినిమాలు చేసింది. ఇక నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్యతో బంగార్రాజు, శైలజా రెడ్డి సినిమాల్లో నటించింది. ఇక నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ నటించిన హలో సినిమాలో రమ్యకృష్ణ నటించింది. ఈ నలుగురితో మనం సినిమాలో సమంత కూడా నటించినా రమ్యకృష్ణ మాత్రం వేర్వేరు సమయాల్లో విడివిడిగా నటించింది.