పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓజీ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ విడుదలైంది. ఓజీ మొదటి షో, బుకింగ్స్ విషయంలో అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజీపై క్రేజీ అప్డేట్ ఇది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ సినిమాగా డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా విభిన్నమైన లుక్‌లో కన్పించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా ప్రియాంక మోహనన్ నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రతి నాయకుడిగా టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అజయ్ ఘోష్ నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి సువ్వీ సువ్వీ సాంగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి రెండు కీలకమైన అప్డేట్స్ ఉన్నాయి.
సెప్టెంబర్ 25 కంటే ముందే ఏపీలో మొదటి షో
ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఏపీలో మాత్రం ఒకరోజు ముందే సెప్టెంబర్ 24 రాత్రి 9 లేదా 9.30 గంటలకు తొలి షో పడవచ్చని తెలుస్తోంది. తెలంగాణలో మాత్రం 25వ తేదీ లేదా సెప్టెంబర్ 24 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కావచ్చని సమాచారం. సెప్టెంబర్ 24 రాత్రి ప్రారంభమయ్యే ప్రీమియర్ షో ద్వారా ఫ్యాన్స్ స్పందనను రియల్ టైమ్ ద్వారా అందించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ సెప్టెంబర్ 19 నుంచే ప్రారంభం కానున్నాయి. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ దాదాపుగా ఇదే ఖరారు కావచ్చు. ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్‌లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతుండటంతో టాలీవుడ్లో ఓజీ పెద్ద బజ్ క్రియేట్ చేస్తోంది.