పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ సినిమా ఓజీ విడుదలకు ముందే భారీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రీమియర్ షో ప్రీ సేల్స్ దూసుకుపోతున్నాయి. ఓవర్సీస్ పరిస్థితే ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంకెలా ఉంటుందోననే చర్చ నడుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పవన్ కళ్యాణ్-సుజీత్ కొత్త సినిమా ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ అప్పుడే దుమ్ము రేపుతోంది. విడుదల కాకుండానే రికార్డు వేట మొదలెట్టింది. నార్త్ అమెరికా బాక్సాఫీసులో సంచలనాలు రేపుతోంది. ప్రీమియర్ సేల్స్‌లో అప్పుడే 1 మిలియన్ డాలర్లు రాబట్టేసింది. ఇది చాలా అరుదైన రికార్డు. ఓజీ రేపుతున్న తుపానుతో బాక్సాఫీసు లెక్కలు సరిచేయాల్సి వస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఓవర్సీస్ ప్రీమియర్ ప్రీ సేల్స్ పరిస్థితే ఇలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకెలా ఉంటుందోనని అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ఇప్పటికే ఓజీ సినిమాకు సంబంధించి విడుదలైన రెండు పాటలు చాలా వైరల్ అవుతున్నాయి. సినిమా పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఓజీ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. కచ్చితంగా ఓజీ బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు రేపనుందనే అంచనా చాలామందిలో ఉంది. పవన్ కళ్యాణ్‌తో పాటు ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ తొలిసారిగా విలన్‌గా టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.