వ్యామోహం, లైంగిక కోర్కెలతో కట్టుకున్న భర్తను..తరువాత కన్న కూతురిని నిర్ధాక్షిణ్యంగా చంపేసిన వ్యవహారం గుట్టు వీడింది. డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. తెలంగాణలో సంచలనం రేపిన ఈ డబుల్ మర్డర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సినిమా కధను తలపించేలా జరిగిన డబుల్ మర్డర్ ఇది. కన్న తల్లే హంతకురాలు. ఈమె ప్రియుడు మరో నిందితుడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోడిపల్లి అటవీ ప్రాంతంలో ఆగస్టు 25న ఓ యువతి మృతదేహం లభ్యమైంది. చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో క్షుద్రపూజలు చేసినట్టుగా ఉంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలతో బలిచ్చారనే అనుమానాలు వ్యక్తం కాగా ఆ కన్న తల్లి కూడా అదే చెప్పింది. కానీ పోలీసులు కాస్త లోతుగా విచారణ జరపడంతో అసలు విషయం కాస్తా బయటపడింది. ఈ యువతి హత్య వెనుక ఉన్న మిస్టరీ వీడింది. కన్న తల్లే హంతకురాలని పోలీసులు తేల్చారు.
ఈ యవతి హత్యకు కారణం అంతకంటే రెండు నెలల ముందు జరిగిన యువతి తండ్రి కుమార స్వామి హత్య. తన కంటే వయసులో సగం కూడా లేని 24 ఏళ్ల రాజ్ కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత జూన్ నెల 25వ తేదీన భర్తను మట్టుబెట్టి..అనారోగ్యంతో మరణించాడంటూ నమ్మించి దహన సంస్కారాలు పూర్తి చేసింది. తండ్రి మరణంపై అనుమానం వచ్చిన కూతురు వర్షిణి తల్లిని నిలదీసింది. దాంతో కూతురుకి తెలిసిపోయిందనే కారణంతో ప్రియుడితో కలిసి కూతుర్ని అడ్డు తొలగించాలనుకుంది. అంతే చంపేసింది. మృతదేహాన్ని ఆగస్టు 25న కాటారం అటవీ ప్రాంతలో వదిలేసింది. యూట్యూబ్ వీడియోలు చూసి క్షుద్రపూజల సీన్ క్రియేట్ చేశారు. ఏమీ ఎరగనట్టు కూతురు కన్పించడం లేదంటూ ఫిర్యాదు చేసింది ఆ కసాయి తల్లి.
ఫోన్ టెక్నాలజీ ఆధారంగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ప్రియుడి మోజులో పడి, లైంగిక వాంఛల కోసం కట్టుకున్న భర్తను ఆ తరువాత కన్న కూతురిని హతమార్చిన ఆ కసాయి తల్లి, ఆమె ప్రియుడు రాజ్ కుమార్ ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు.