ఈసారి రణరంగమే అంటున్న బిగ్‌బాస్ యాజమాన్యం సెలెబ్రిటీల ఎంపికలో భారీ స్కెచ్ వేస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్, వివాదాస్పద జంట దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారనేది చర్చనీయాంశమౌతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ దివ్వెల మాధురి వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భార్యను వదిలి ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వివాదాస్పదమైన జంట ఇది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న జంట కూడా. సెప్టెంబర్ 7 నుంచి మొదలు కానున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 పై చాలా అంచనాలున్నాయి. ఈసారి అంతా రణరంగమే అంటున్నారు కింగ్ నాగార్జున. ఈ క్రమంలో షోను రక్తికట్టించేందుకు వైరల్ వ్యక్తుల్ని హౌస్‌లో రప్పించే ప్లాన్ చేస్తోంది బిగ్‌బాస్ యాజమాన్యం. ఇందులో భాగంగా ఇప్పుడు ఏపీలో అత్యంత సంచలన జంటగా మారిన దువ్వాడ శ్రీనివాస్ అండ్ దివ్వెల మాధురి పేర్లు విన్పిస్తున్నాయి.
జంటగా వస్తారా లేక దివ్వెల మాధురి ఒక్కరేనా
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో దివ్వెల మాధురి పేరు దాదాపుగా ఖరారైనట్టు వార్తలొస్తున్నాయి. అటు రాజకీయంగా ఇటు సోషల్ మీడియా పరంగా ఈమె పేరు అత్యంత పాపులర్ కావడంతో షో ఆసక్తిగా ఉంటుందనేది బిగ్‌బాస్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఎక్కడికెళ్లినా జంటగా వెళ్తుండటంతో ఇద్దరూ జంటగానే ఎంట్రీ ఇస్తారనే వార్తలు కూడా విన్పిస్తున్నాయి. ఇప్పటి వరకైతే దివ్వెల మాధురి పేరు దాదాపుగా ఖాయమైనట్టేనంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా ఎంట్రీ ఇస్తే ఇక బిగ్‌బాస్ షో రక్తి కట్టినట్టే.
బిగ్‌బాస్ హౌస్‌లో ఈసారి సామాన్యులు ఎంట్రీ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇక సెలెబ్రిటీల విషయంలో మరి కొందరి పేర్లు విన్పిస్తున్నాయి. వీరిలో సీరియల్ నటుడు దేబ్ జాన్ మోదక్, జబర్తస్త్ ఇమ్మాన్యుయేల్, అలేఖ్య చిట్టి ఫేమ్ రమ్య మోక్ష, హీరో సుమంత్ అశ్విన్, నటి జ్యోతి రాయ్, అమర్ దీప్ చౌదరి భార్య తేజస్విని గౌడ ఉన్నారు.