బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఉన్నట్టే ఈసారి కూడా కన్నడ సెలెబ్రిటీలు హల్‌చల్ చేయనున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీకు వచ్చిన నటీనటులు చాలామంది సందడి చేశారు. చివరకు గత సీజన్ విన్నర్ నిఖిల్ కూడా కన్నడిగుడే కావడం విశేషం. బిగ్‌బాస్ తెలుగు హౌస్‌ని కన్నడ నటీనటులతో నింపేస్తున్నారంటూ విమర్శలు వచ్చినా యాజమాన్యం వాటిని పట్టించుకోలేదని తెలుస్తోంది. నిఖిల్‌తో పాటు శోబాశెట్టి, యష్మి గౌడ, పృధ్విల జోరు కన్పించింది. ఈసారి కూడా కన్నడ సెలెబ్రిటీలకు అవకాశం కల్పించనుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో కన్నడ నటి పేరు విన్పిస్తోంది.
బిగ్‌బాస్ హౌస్‌లో కన్నడ మందారం
ఈసారి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో ముద్దమందారం సీరియల్‌లో పార్వతి పాత్రతో మెప్పించిన తనూజ గౌడ ఎంట్రీ దాదాపు ఖాయమని తెలుస్తోంది. కన్నడ నటి అయినా ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. కన్నడ సినిమాలు కూడా చేసినా పెద్దగా గుర్తింపు లభించలేదు. సీరియల్స్ ద్వారా మంచి పేరు సంపాదించింది. ముద్దమందారంతో పాటు నాగభైరవి సీరియల్‌లో కూడా ఆమె నటిస్తోంది.
ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో సెలెబ్రిటీలతో పాటు ఐదుగురు సామాన్యులు కూడా పాల్గొననున్నారు . ఈ ఐదుగురి ఎంపిక కోసం దాదాపు 3 వారాలుగా స్క్రీనింగ్ ప్రక్రియ నడుస్తోంది. వందల అప్లికేషన్ల నుంచి 40 మందిని ఎంపిక చేసి అందులోంచి టాప్ 15 పైనల్ చేశారు. ఇప్పుడు చివరి దశలో ఐదుమందిని సెలెక్ట్ చేసి బిగ్‌బాస్ హౌస్‌లో పంపిస్తారు.