బిగ్‌బాస్ తెలుగు సీజన్ తెలుగు రెండో వారం ఎలిమినేషన్ వచ్చేసింది. ఈ వారాంతంలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారో తేలనుంది. మరోవైపు కంటెస్టెంట్ల మధ్య హాట్ హాట్ వాదనలు జరుగుతున్నాయి. సంజన మరోసారి నోరు జారి ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రెండో వారం ఎలిమినేషన్‌కు ఒక రోజు ముందు కంటెస్టెంట్ల మధ్య తీవ్రంగా వాదోపవాదనలు జరిగాయి. టెనెంట్లను ఓనర్లయ్యే అవకాశం కల్పించడంతో ఈ వాదనలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే సంజనా-ఫ్లోరా శైని కలిసి సుమన్ శెట్టిని టార్గెట్ చేశారు. దాంతో కాస్సేపు సోఫాలో కూర్చున్న సుమన్ శెట్టిపై సంజనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మమ్మల్ని చెడ్డోళ్లుగా చేసి మీరు గాజులేసుకుని కూర్చోండంటూ ఆగ్రహించడంతో సుమన్ కూడా దీటుగా కౌంటర్ ఇచ్చేశాడు. మీరు ఎప్పుడో చెడ్డోళ్లయ్యారంటూ బదులిచ్చాడు.
ఇదంతా చూస్తున్న శ్రీజ సంజనాకు వార్నింగ్ ఇచ్చింది. గాజులేసుకుని కూర్చోండనే మాటలు మాట్లాడవద్దని స్పష్టం చేసింది. గేమ్ పూర్తయ్యాక తన తప్పు తెలుసుకున్న సంజనా గల్రానీ..సుమన్ శెట్టికి క్షమాపణలు చెప్పింది. ఓ సోదరిగా క్షమించమని కోరడంతో సుమన్ శెట్టి కూడా అందుకు సమ్మతించాడు. కానీ ఈ ఘటనపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సంజనా మాటలపై మండిపడుతున్నారు. గత వారం మాస్క్ మ్యాన్ మనీష్ ఆడవాళ్లను చులకన చేసి మాట్లాడినప్పుడు ఫైర్ అయిన సంజనా ఇప్పుడిలా మాట్లాడటమేంటని ప్రశ్నిస్తున్నారు. గాజులేసుకుని కూర్చోండంటే ఆడవాళ్లకు ఏం చేతకాదని చెప్పడమే కదా అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై కింగ్ నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.