పవన్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇది. చాలాకాలం తరువాత పవన్ కళ్యాణ్‌కు మంచి హిట్ లభించిన ఆనందంలో ఉన్న అభిమానులు ఈ వార్త వింటే ఎగిరి గంతేస్తారు. ఓజీ సీక్వెల్ గురించి దర్శకుడు సుజీత్ కీలక విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ తాజా సినిమా ఓజీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానల ఆనందానికి హద్దుల్లేవు. మాఫియా డాన్ పాత్రలో పవన్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో ఓజీ 2 గురించి కీలక ప్రకటన వచ్చింది. దర్శకుడు సుజీత్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఓజీ సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడిన సుజీత్ కీలక విషయాలు తెలిపారు. సినిమా సక్సెస్ అవడంతో మూడేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కినట్టయిందన్నారు. సినిమాకు ఇంతటి పవర్, భారీతనం రావడానికి కారణం పూర్తిగా పవన్ కళ్యాణ్ అని చెప్పారు. జానీ సినిమా చూసినప్పుడు పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారైనా కలవాలనుకునేవాడినని..అలాంటిది నేరుగా ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం లభించిందన్నారు. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తన జీవితంలో ఇదే అతి పెద్ద డ్రీమ్ అని చెప్పారు. నవీన్ సూలి ఎడిటింగ్, రవి చంద్రన్ సినిమాటోగ్రఫీ, తమన్ సంగీతం ఈ సినిమాకు హైలైట్ అన్నారు. ఈ సినిమా ఓ అద్భుతమైన దృశ్య కావ్యమని అభివర్ణించారు. ఈ క్రమంలో ఓజీ 2 సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.
అకిరా నందన్‌తో ఓజీ 2
ఓజీ 2 అకినా నందన్ ప్రధాన పాత్రలో ఉంటుందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని దర్శకుడు సుజీత్‌ను అడిగినప్పుడు ఆయన కొట్టిపారేయలేదు. ఓజీ 2 అకిరా నందన్‌తో తీస్తామా లేదా అనేది పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు. అకిరాతో తీస్తే నిజంగా ఆనందం ఉంటుందని పేర్కొన్నారు. అకిరా కూడా సెట్స్‌పై వచ్చాడని, అతనిలో ఓ స్పార్క్ ఉందని సుజీత్ చెప్పాడు. సుజీత్ చేసిన తాజా ప్రకటనతో ఓజీ సీక్వెల్‌పై అంచనాలు మొదలయ్యాయి.