బిగ్బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. చదరంగం కాదు ఈసారి రణరంగమే అని చెబుతున్నట్టే బిగ్బాస్ హౌస్లో బిగ్ ఫైట్ జరగనుంది. బిగ్బాస్ హిస్టరీలోనే ఊహించని సర్ప్రైజ్ కన్పించనుంది. ఆ వివరాలు మీ కోసం..
బిగ్బాస్ తెలుగు సీజన్ 2 అప్పుడే మూడో వారంలో ప్రవేశించింది. మొదటి రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ కాగా మూడో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు మూడో వారం మధ్యలో బిగ్బాస్ ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఈసారి డబుల్ ఎలిమినేషన్లు ఉండవచ్చు. అంతకంటే ముఖ్యంగా వైల్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని తెలుస్తోంది. ఈ వారం ఏకంగా ముగ్గురు వైల్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. మరి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరనేది పరిశీలిస్తే అందరూ సామాన్యులే అని తెలుస్తోంది.
ప్రస్తుతం ఇద్దరు ఎలిమినేట్ అవడంతో బిగ్బాస్ హౌస్లో 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్రవేశపెట్టి..వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కల్పించవచ్చు. సామాన్యుల్ని ఎంపిక చేసిన అగ్నిపరీక్షలో నిలిచినవారినే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి పంపిస్తారని తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్లలో నాగ ప్రశాంత్, షాకీబ్, దివ్య నికిత పేర్లు విన్పిస్తున్నాయి. అగ్నిపరీక్షలో గెలిచిన ఈ ముగ్గురు నిజంగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా వారం వారం జరిగే ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటారో లేదో చూడాలి.