వారాయ్ అంటూ భయపెట్టి మరీ మెప్పించిన సూపర్ హిట్ సినిమా గుర్తుందా. ఈ సినిమా ఇప్పటికే ఓ సెన్సేషన్. ఇదే సినిమాలో బాలనటిగా మెప్పించిన ఆ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది కూడా. ఎవరా నటి, ఏ సినిమానో గెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా..ఆ వివరాలు మీ కోసం.
దక్షిణాదిలోని సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి చంద్రముఖి. ఈ సినిమా అప్పట్లో తమిళ, తెలుగు భాషల్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. వారాయ్ అంటూ ఎంత భయపెట్టాలో అంత భయపెట్టింది. నయనతార కెరీర్ మలుపు తిప్పిన సినిమా కూడా ఇదే. సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లక్ బస్టర్ సినిమాల్లో ఈ సినిమా అత్యంత కీలకమైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసులో కనకవర్షం కురిపించింది. పి వాసు తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు జ్యోతిక, ప్రభు, నయనతార నటించారు. ఈ అందరితో పాటు ఇదే సినిమాలో కన్పించిన ఛైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా. అత్తింతోం…పాటలో కన్పించిన చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఈ సినిమా చంద్రముఖి.
ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ పేరు ప్రహర్షిత శ్రీనివాసన్. తమిళంలో చాలా సినిమాలు చేసిన ప్రహర్షిత చదువు కోసం సినిమాలు వదిలేసింది. 2021లో పెళ్లి చేసుకుంది. ఇటీవలి కాలంలో బుల్లితెరపై వివిధ సీరియల్స్ ద్వారా ఆకట్టుకుంటోంది. లీడ్ రోల్స్ పోషిస్తూ క్రేజీ హీరోయన్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అసలీమె ఫోటో చూస్తే చంద్రముఖిలో నటించిన చిన్నారి అంటే ఎవరూ నమ్మరు కూడా. అంతలా మారిపోయింది.