తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా ఇవాళ అగస్టు 14న విడుదలైంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. 8 వారాల తరువాత అంటే అక్టోబర్ రెండో వారంలో ఓటీటీ విడుదల కానుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా భారీ అంచనాల మధ్య ఇవాళ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంచనాలకు తగ్గట్టే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుుడు ఓటీటీ ఎప్పుడనే చర్చ మొదలైంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
భారీ అంచనాలతో విడుదలైన రజనీకాంత్ కూలీ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల్ని రంజింపజేస్తోంది. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో రజనీకాంత్ మాస్ స్టైల్, యాక్షన్ సీన్లు అద్దిరిపోయాయి. ఇక దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తన ప్రతిభను చూపించారంటున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ లీడ్ రోల్ కాగా టాలీవుడ్ హీరో నాగార్జున తొలిసారిగా విలన్ పాత్రలో కన్పించాడు. ఇక బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ ప్రత్యేక గెస్ట్ రోల్‌లో అలరించాడు. స్టైలిష్ విలన్ పాత్రలో అందర్నీ అలరించగా సౌబిన్ షాహిన్ నటన వేరే లెవెల్‌లో కన్పించింది. పూజా హెగ్డేతో మోనికా సాంగ్ అయితే కేక పుట్టించింది. మొత్తానికి ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్ సినిమాగా నిలిచింది.
ఏ ఓటీటీలో ఎప్పుడు
కూలీ సినిమా ఏ ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందనే టాక్ మొదలైంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. నిబంధనల ప్రకారం 8 వారాల తరువాత అంటే అక్టోబర్ రెండో వారంలో విడుదల కావచ్చు. కలెక్షన్లు లేదా రష్ తక్కువగా ఉంటే అంతకంటే త్వరగా రావచ్చు.