తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ కూలీ గురించి బిగ్ అప్‌డేట్ ఇది. ఇది వింటే రజనీ ఫ్యాన్స్‌కు పండగే. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఖరారైంది. ఎప్పుడంటే..
రజనీకాంత్ హీరోగా టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రతి నాయకుడిగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా కూలీ. ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని 500 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, శాండల్‌వుడ్ హీరో ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ నటించారు. వేయి కోట్లు వసూలు చేస్తుందని భావించారు కానీ సాధ్యం కాలేదు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ కథా నాయిక కాగా సత్యరాజ్, రచిత రామ్ ముఖ్య పాత్రలో కన్పించారు. ఇక మరో హీరోయిన్ పూజా హెగ్డే మోనికా పాటతో హల్‌చల్ చేసింది. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు హైలైట్.
ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్
ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కూలీ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అనుకున్న తేదీ కంటే ముందే అంటే సెప్టెంబర్ 11న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో విడుదల కానుందని ప్రకటించారు. అయితే హిందీ వెర్షన్ గురించి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కూలీ హిందీ వెర్షన్ మరో ఓటీటీలో విడుదల కావచ్చని తెలుస్తోంది.