ఆర్జీవీ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమా సిండికేట్ ప్రకటన తరువాత ఎలాంటి అప్‌డేట్ లేని రామ్ గోపాల్ వర్మ సడెన్‌గా హారర్ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. గతంలో రాత్, భూత్, డర్నా మనా హై, డర్నా జరూరీ హై వంటి సినిమాలతో భయపెట్టిన ఆర్జీవీ ఇప్పుడు మరోసారి అందుకు సిద్ధమయ్యాడు. హారర్ సినిమాల్లో ఇప్పటి వరకు రాని కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఎవరైనా సరే ఏదైనా అన్యాయం జరిగినా లేక భయమేసినా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తుంటారు. కానీ ఆ పోలీస్ స్టేషనే భయపెడితే ఏంటి పరిస్థితి..ఆ పోలీసులే భయపెడితే ఎక్కడికి వెళ్తారంటూ ట్వీట్ చేసి రిలీజ్ చేసిన పోస్టర్ సంచలనంగా మారింది. ఆర్జీవీ అప్‌కమింగ్ సినిమా పోస్టర్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.
ఈ హారర్ సినిమా పేరు ఇంకా ప్రకటించలేదు. కేవలం క్యాప్షన్లతో పోస్టర్ రిలీజ్ చేశాడు. పోలీస్ స్టేషన్ మే భూత్, చనిపోయినోళ్లను అరెస్ట్ చేయలేరనే క్యాప్షన్‌తో ఉంటుంది. అసలు సినిమా కథ విషయానికొస్తే పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఓ భారీ ఎన్‌కౌంటర్‌లో కొందరు గ్యాంగ్‌స్టర్స్ చనిపోతారు. ఆ తరువాత వాళ్లంతా దెయ్యాలుగా మారడంతో ఆ స్టేషన్ కాస్తా హాంటెడ్‌గా మారుతుంది. భూతాలుగా మారిన గ్యాంగ్‌స్టర్స్ పోలీసులను ఎలాంటి ఇబ్బందులు పెడతారు, పోలీసులు ఎలా తప్పించుకుంటారనేది స్టోరీ లైన్.
గతంలో రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో సత్య, శూల్, కౌన్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలోనూ, జెనీలియా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ హారర్ సినిమా పోస్టర్ గ్లింప్స్‌ను ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. ఈ సినిమా టైటిల్ ఏంటి, ఎప్పుడు విడుదల, షూటింగ్ ఏ దశలో ఉందనే వివరాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి.
A DREADED GANGSTER is KILLED by an ENCOUNTER COP and he COMES BACK as a GHOST to HAUNT the POLICE STATION ..Hence the title “POLICE STATION MEIN BHOOT” You Can’t Arrest The Dead @BajpayeeManoj @geneliad @VauveEmirates @KarmaMediaEnt #uentertainmenthub #PoliceStationMeinBhoot pic.twitter.com/eMOyusT8iy
— Ram Gopal Varma (@RGVzoomin) September 1, 2025