అందం అభినయంతో ఆకట్టుకునే ముద్దుగుమ్మల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మగాడిలా ఉంటుందంటూ సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు ఆ బాలీవుడ్ భామ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ వైపు మరాఠీ, హిందీతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటున్న అందాల భామ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో అందర్నీ ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ మరి కొన్ని సినిమాలు చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌లో చేసినా ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీమె తన వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ స్టార్ నటి హాట్ బాంబ్ బిపాసా బసుపై చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఇటీవల హీరో ధనుష్‌తో డేటింగ్ రూమర్లతో వార్తల్లో నిలిచి ఆ తరువాత తను ఓ స్నేహితుడు మాత్రమేనని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిపాసా బసు గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది.
ఆ హీరోయిన్ మగాడిలా ఉంటుంది
నేను బిపాసా బసు కంటే అందంగా ఉంటాను. ఆమె ( బిపాసా బసు ) కండలు తిరిగిన దేహంతో మగాడిలా కన్పిస్తుంది. ఆమె కంటే నేను చాలా బెటర్ అంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. అలా ఆ నోటా ఈనోటా బిపాసాకు చేరనే చేరింది. ఆమె మాత్రం మృణాల్ పేరు ఎత్తకుండానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
మహిళలు స్ట్రాంగ్ కూడా కన్పించకూడదనే పాతకాలపు ఆలోచనల నుంచి బయటకు రావాలని బిపాసా బసు ఇన్‌స్టా స్టోరీలో తెలిపింది. మహిళలు ఎప్పుడూ బలంగా ధృడంగా ఉండాలని అప్పుటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని చెప్పింది. బలమైన మహిళలు ఎప్పుడూ ఒకరి ఉన్నతి కోసం పాడుపడతారని, అందమైన స్త్రీలకు మజిల్స్ అవసరమేనని వ్యాఖ్యానించింది. పేరు ప్రస్తావించకపోయినా మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యలకు గట్టి సమాధానం ఇచ్చింది బిపాసా బసు.