ఇటీవల విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు నుంచి ఎందుకు తప్పుకోవల్సి వచ్చిందో ఎట్టకేలకు దర్శకుడు క్రిష్ వెల్లడించారు. క్రిష్ మధ్యలో వదిలేసిన ఈ సినిమాని జ్యోతికృష్ణ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టాలీవుడ్ మేటి దర్శకుల్లో, అందులోనూ క్రియేటివిటీ కలిగినవారిలో జాగర్లమూడి క్రిష్ పేరు ప్రముఖంగా చెప్పుకోవల్సి వస్తకుంది. ఆయస తీసే సినిమాల కాన్సెప్ట్ విభిన్నంగా ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్‌తో హరిహర వీరమల్లు సినిమా అనగానే భారీ అంచనాలు వచ్చాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను క్రిష్ 50 శాతం పూర్తి చేశారు. ఆ తరువాత ఎందుకో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. ఆయనంతట ఆయనే వైదొలిగారా లేక ఎవరైనా ఒత్తిడి పని చేసిందా అనేది తెలియదు. ఆ తరువాత ప్రాజెక్టు ఆలస్యమైంది. తరువాత మరో దర్శకుడు జ్యోతికృష్ణ ఈ సినిమాను పూర్తి చేశారు. ఫలితంగా స్టోరీ నేరేషన్, కధా శైలి, విజన్ మారిపోయింది. సినిమా కధ కూడా చాలా వరతకు మారిందనే వార్తలు వచ్చాయి. ఇదంతా సినిమాపై పడి డిజాస్టర్‌గా నిలిచింది. అప్పటి నుంచి అసలు క్రిష్ ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు స్వయంగా క్రిష్ ఈ విషయాన్ని వెల్లడించారు. హరిహర వీరమల్లు సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నారో వివరించారు.
నా వ్యక్తిగత కారణాల వల్లే అలా జరిగింది
నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా గౌరవమని వెల్లడించిన క్రిష్..నిర్మాత ఏఎం రత్నంతో కూడా మంచి అనుబంధం ఉందన్నారు. హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకోడానికి కారణం పూర్తిగా వ్యక్తిగతమన్నారు. ఏ విధమైన ఇతర సమస్యలు లేవని, కేవలం వ్యక్తిగత పరిస్థితుల వల్లనే తప్పుకోవల్సి వచ్చిందన్నారు. ఒక స్టార్ హీరో, భారీ బడ్జెట్ సినిమా నుంచి ఓ దర్శకుడు మధ్యలో తప్పుకోవడం అంత తేలికైన విషయం కానే కాదు. అందుకే ఈ విషయం ఇప్పటి వరకు చర్చనీయాంశంగా ఉండింది. ఇప్పుడు జాగర్లమూడి క్రిష్ స్వయంగా కారణమేంటో వెల్లడించారు.