జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షో ట్రెండ్ అవుతోంది. నాగార్జునతో మొదలై శ్రీల తరువాత ఇప్పుడు నానితో సంచలన విషయాలు బయటపెడుతోంది. తన విజయానికి కారణం ఎవరు, వెనుక ఎవరున్నారో నాని రివీల్ చేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా పరిశ్రమలో వచ్చి నిలదొక్కుకోవడమే కాకుండా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు నాని. మరి నాని సినిమా ప్రస్థానంలో కుటుంబ సభ్యుల పాత్ర ఉందా లేదా, ఎవరు సపోర్ట్ చేశారనే విషయాల్ని నాని రివీల్ చేశాడు. సినిమా అనగానే ఇంట్లో కుటుంబసభ్యులు నీ ఇష్టం అన్నారని చెప్పుకొచ్చాడు. చదువులో అంతగా రాణించకపోవడంతో సినిమా అనగానే పెద్గగా అభ్యంతరం చెప్పలేదన్నాడు. అయితే తనను పూర్తిగా సపోర్ట్ చేసింది, ప్రేరేపించింది తన పిన్ని, అక్క అని నాని వెల్లడించాడు. ఎందుకో గానీ మొదటి నుంచి పిన్నికి తనపై నమ్మకం ఎక్కువగా ఉండేదన్నాడు. వీడు గొప్పోడవుతాడని చెప్పేదన్నాడు.
ఇక అక్క కూడా చాలా ప్రోత్సహించేదన్నాడు. తాను ఏదైనా కధ చెప్పేటప్పుడు ఆసక్తిగా వినడమే కాకుండా అవసరం మేరకు ఫీడ్ బ్యాక్ ఇచ్చేదన్నాడు. తాను చెప్పే కధలు వింటూ తనకు కూడా ఈ రంగంపై ఆసక్తి పెరిగిందన్నాడు. తనే సొంతంగా రాసుకున్న మీట్ క్యూట్ షోకు దర్శకత్వం వహించిందన్నాడు. ఆ తరువాత అమెరికా నుంచి వచ్చి కో ప్రొడ్యూసర్‌గా తీసిన కోర్డు సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసన్నాడు. ఇలా మొత్తం తన సినిమా ప్రస్థానంలో తనను వెన్నంటి ప్రోత్సహించింది, మద్దతుగా నిలిచింది పిన్ని, అక్క అని చెప్పాడు.