సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. కొందరు ఇండస్ట్రీలో వచ్చాక ఫ్రెండ్స్‌గా మారితే మరి కొందరు చిన్నప్పటి నుంచి స్నేహబంధంలో ఉంటారు. అలాంటి జంటే ఇది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తున్న ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఫోటోలో ముద్దు ముద్దుగా కన్పిస్తున్న ఇద్దరు చిన్నారులు ఎవరో తెలుసా. ఏమైనా గుర్తు పట్టగలుగుతున్నారా. ఇది ఒకప్పటి ఫోటో. ఇప్పుడీ ఇద్దరూ స్టార్ హీరోయిన్స్ అంటే నమ్మశక్యంగా లేదు కదా. చిన్నప్పటి నుంచి ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. స్టార్ హీరోయిన్లుగా మారినా ఇంకా ఆ బంధం అలాగే కొనసాగుతోంది. ఇద్దరూ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ పరిశ్రమలో వచ్చి తమదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉండే ఈ ఇద్దరికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
విశేషమేంటంటే ఈ ఇద్దరూ సినిమా రంగంలో టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అందంలో , అభినయంలో ఇద్దరికిద్దరే. ఒకరు నాటి మేటి నటి మేనకా సురేష్ కుమార్తె కీర్తి సురేశ్ కాగా మరొకరు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్. కీర్తి సురేశ్ నేరుగా నటిగా ఎంట్రీ ఇస్తే కళ్యాణ్ ప్రియదర్శన్ ఆర్ట్ డైరెక్టర్‌గా చేసి 2017లో హలో సినిమాతో అఖిల్ సరసన హీరోయిన్‌గా టాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది. కళ్యాణ్ ప్రియదర్శన్‌కు ప్రస్తుతం మలయాళంలో మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. మొత్తానికి ఇద్దరికిద్దరూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.
ఇటీవల పెళ్లయినా సరే కీర్తి సురేశ్ కెరీర్ మాత్రం ఆగలేదు. చేతి నిండా సినిమాలున్నాయి. త్వరలో రివాల్వర్ రీటాగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మొత్తానికి చిన్ననాటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండి సినీ రంగంలో ప్రవేశించి స్టార్ హీరోయిన్స్‌గా మారినా ఆ స్నేహబంధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉండటం విశేషం.