పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఓజీ సినిమా బిగ్గెస్ట్ హిట్ కానుందా అంటే అవుననే పరిస్థితులు కన్పిస్తున్నాయి. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ప్రీ సేల్స్‌లో దుమ్ము రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన పవన్ కళ్యాణ్ కొత్త సినిమా దే కాల్ హిమ్ ఓజీ ఇప్పటికే బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన పవన్ సినిమాలన్నింటిలో ఇది ప్రత్యేకం కానుంది. అభిమాన నటుడిని గ్యాంగ్ స్టర్ అవతారంలో చూసేందుకు అభిమానులు చాలా థ్రిల్ అవుతున్నారని తెలుస్తోంది. బహుశా అందుకే ఈ సినిమా ప్రీ సేల్స్ దుమ్ము రేపుతున్నాయి. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ సేల్స్ యూఎస్‌లో ధమాకా రేపుతున్నాయి.
బజ్ క్రియేట్ చేస్తున్న యూఎస్ ప్రీ సేల్స్
అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలకు సంబంధించిన ప్రీ సేల్స్‌లో ఇప్పటికే 3 లక్షల డాలర్లు వసూలు చేసింది. 630 షోలకు సంబంధించిన ప్రీ సేల్ కలెక్షన్ ఇది. సినిమా విడుదలకు ముందే అత్యంత వేగంగా వసూలైన కలెక్షన్లు ఇవి. ప్రీ సేల్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే బుకింగ్స్ పూర్తిగా ఓపెన్ అయితే ఇంకెలా ఉంటుందో అనే వాదన విన్పిస్తోంది. బుకింగ్స్ పూర్తిగా ఓపెన్ అయితే పీక్స్‌కు చేరవచ్చని అంచనా. రెండ్రోజుల్లోనే 10 లక్షల డాలర్లు వసూలు చేయవచ్చనే అంచనాలున్నాయి.
పవన్ కళ్యాణ్ సరసన ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ ప్రియాంక మోహన్ పోషిస్తుండగా విలన్ పాత్రలో తొలిసారిగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. సుజీత్ సినిమా అంటేనే బారీ బడ్జెట్ ఖాయం. తమన్ సంగీతం ఈ సినిమాకు హైలైట్ అంటున్నారు