పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ కిక్ ఇచ్చే న్యూస్ ఇది. వారసుడిని ఇండస్ట్రీలో దింపేందుకు పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారట. ఓ ప్రముఖ దర్శకుడికి ఇప్పటికే ఆ బాధ్యతలు కూడా అప్పగించారని టాక్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమా తరువాత పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ కాగా రెండవది దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించనున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. చిరంజీవి సోదరుడిగా […]
పుష్ప 2 భారీ విజయంతో బాక్సాఫీసు రికార్డులు కొల్లగొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీతో భారీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి వస్తున్న అప్డేట్స్ అభిమానుల అంచనాల్ని పెంచేస్తున్నాయి. సినిమాకు బలం చేకూర్చేందుకు ఇతర అగ్రనటుల్ని కూడా అట్లీ రంగంలో దింపనున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అల్లు అర్జున్-అట్లి సినిమాపై క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. ఈ సినిమాలో బన్నీ ఎన్నడూ చూడని పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది. ఈ రోల్ […]
రాసిపెట్టుంటే జరగకుండా ఆపలేం. రాసి పెట్టలేకుంటే జరిగేది నిలువరించలేం. చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాంటిదే ఈ ఘటన. సీసీటీవీలో రికార్డు కాకుంటే మాత్రం చెప్పినా ఎవరూ నమ్మని పరిస్థితి. బతికి బట్టకట్టిన ఈ వీడియో అందుకే వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తారనేది ముందే భగవంతుడు రాసేస్తాడంటారు. అందుకే ఒక్కోసారి కొంతమంది ఉన్నట్టుండి చిన్నపాటి దెబ్బలకే ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొందరికి ఎంతటి పెద్ద ప్రమాదం ఎదురైనా […]
అభిమానానికి ఎల్లలు ఉండవు. హద్దులు చెరిగిపోతుంటాయి. జస్ట్ ఓ సినిమా చూసేందుకు దేశం దాటి వచ్చింది. ఇప్పుడే కాదు..ప్రతిసారీ ఇలా దేశం దాటొచ్చి సినిమా చూసి వెళ్లిపోతుందట. ఇంతకీ ఈమె ఎవరు, ఎవరి అభిమాని, ఏ సినిమా చూసేందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వార్ 2 సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మొదటి ఆరు రోజుల్లో 300 కోట్లు వసూలు చేసింది. హృతిక్ రోషన్, తారక్ కలిసి నటించిన ఈ సినిమాను బాలీవుడ్ […]
క్రికెట్ అభిమానుల హై వోల్టేజ్ మ్యాచ్‌లు మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్నాయి. మ్యాచ్‌లు ఎలా ఉంటాయో గానీ యాడ్స్ మాత్రం వోల్టేజ్ ఎక్కువై షాక్ కొడుతున్నాయి. సోనీ టీవీ ప్రకటనల ధరలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ప్రత్యక్ష ప్రసారం హక్కుల్ని కైవసం చేసుకున్న సోనీ టీవీ విడుదల చేసిన ప్రకటనల ధరలు […]
టాలీవుడ్ నటుల్లో ప్రముఖంగా చెప్పుకోవల్సిన పేరు జగపతి బాబు. ఫేజ్ 1లో హీరోగా చేసిన జగపతి బాబు ఫేజ్ 2లో విలన్ పాత్రలతో మెప్పిస్తున్నాడు. కొత్తగా బుల్లితెర యాంకర్‌గా అవతారమెత్తిన జగ్గుభాయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీ కోసం. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది సినిమాలో జగపతి బాబు కీలకపాత్రలో మరోసారి మెప్పించేందుకు సిద్ధమౌతున్నాడు. ఇప్పుడు కొత్తగా బుల్లితెర యాంకర్ అవతారమెత్తాడు. జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోను హోస్ట్ చేస్తున్నాడు. ఆగస్టు […]
మందుబాబులకు ఫుల్ కిక్ లభించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ విన్పించింది. ఇక నుంచి మందు షాపుల వద్దే తాగవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇక నుంచి లిక్కర్ షాపుల వద్దే తాగేందుకు అనుమతి లభించనుంది. వైన్ షాపుల వద్ద తిరిగి పర్మిట్ రూమ్స్ రానున్నాయి. కొత్తగా వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్స్‌కు అనుమతి ఇస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ […]
సినిమా విషయాలు ప్రజలకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అందుకే సినిమా అంశాలకు క్రేజ్ ఎక్కువ. బహుశా అందుకే కోర్టు సినిమా హీరోయిన్ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల కామెంట్లతో నిండిపోతోంది. అసలేమైందంటే.. అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మితమై సూపర్ హిట్ కొట్టిన సినిమాల్లో కోర్టు చెప్పుకోదగ్గది. ఈ సినిమాలో నటించిన శ్రీదేవి అమ్మాయికి మంచి పేరు వచ్చేసింది. అంతే వరుసగా తమిళం, తెలుగులో రెండు సినిమాలు ఒప్పేసుకుంది. అప్పుడే జీవితంలో స్థిరపడుతోంది. ఈ క్రమంలో […]
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై కీలకమైన అప్డేట్ వెలువడింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, జీతాలు ఎంత పెరగనున్నాయో క్లారిటీ వస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొద్దిరోజులుగా 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం ఈ ఏడాది అంటే 2025 డిసెంబర్ నెలతో ముగియనుంది. కొత్త వేతన సంఘం […]
ప్రపంచం మెచ్చిన గణిత మేధావి డాక్టర్ సీఆర్ రావు (102) కన్ను మూశారు.