సూపర్‌స్టార్ మహేశ్ బాబు-రాజమౌళి సినిమా తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అప్పుడే అప్‌డేట్ వచ్చింది. అధికారికంగా ప్రకటన రాకపోయినా దాదాపుగా నిర్ధారణైనట్టు సమాచారం. విభిన్న కథాంశాలు ఎంచుకునే ఆ దర్శకుడు మహేశ్ బాబుకు ఏ స్టోరీ లైన్ చెప్పారనేది ఆసక్తిగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ సినిమా SSMB29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి సినిమా కావడంతో రెండేళ్ల వరకు మహేశ్ బాబు ఫుల్ బిజీ అని చెప్పవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి జాగ్రత్త పడుతున్నాడు. 2027లో ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే రాజమౌళితో సినిమా తరువాత మహేశ్ బాబు అప్‌కమింగ్ సినిమా ఏదనే విషయంపై ఇప్పుడు కీలకమైన అప్‌డేట్ వచ్చింది.
అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి..మహేశ్ బాబుతో సినిమా తీసేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. ఇప్పటికే మహేశ్ బాబుని కలిసి స్టోరీ లైన్ చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్క్రిప్ట్ కూడా సిద్ధమైందట. అయితే మహేశ్ బాబు ఈ సినిమాకు ఎస్ చెప్పారో లేదో ఇంకా తెలియదు. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. సందీప్ రెడ్డితో మహేశ్ బాబు సినిమా అంటే కచ్చితంగా భారీ అంచనాలతో ఉంటుంది. రాజమౌళితో సినిమా తరువాత మహేశ్ బాబు మైత్రీ మూవీ మేకర్స్‌తో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్టోబర్ 10 వరకూ ఇక్కడే వివిధ సీన్స్ తీయనున్నారు.
ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా తెరకెక్కించడంలో ఉన్న సందీప్ రెడ్డి వంగా త్వరలో మహేశ్ బాబుతో సినిమాకు సిద్ధం కానున్నారని సమాచారం. సందీప్ రెడ్డి-మహేశ్ బాబు కాంబినేషన్ కచ్చితంగా వండర్స్ సృష్టించనుందనే అంచనాలతో ఫ్యాన్స్ ఉన్నారు. సందీప్ రెడ్డి మహేశ్ బాబు సినిమాపై ఇంకా పూర్తి సమాచారం రావల్సి ఉంది.