టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా అప్పుడే దుమ్ము రేపుతోంది. ఈసారి బాక్సాఫీసులో తుపాను రేపడం ఖాయమనే అంచనాలు పెరుగుతున్నాయి. యూఎస్ ప్రీ సేల్ ఇందుకు ఉదాహరణ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ ఇది. హరిహర వీరమల్లు సినిమా డిజాస్టర్ కావడంతో షాక్ తిన్న అభిమానులకు ఓజీ సినిమాపై వస్తున్న అప్‌డేట్స్ ఫుల్ జోష్ ఇస్తున్నాయి. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీసులో తుపాను రేపవచ్చని అంచనా వేస్తున్నారు. సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా సినిమా ఓజీ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై నిర్మాతలకు, ఫ్యాన్స్‌కు, పవన్ కళ్యాణ్‌కు చాలా అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై హైప్ బాగా పెరిగింది. ఇప్పుడు యూఎస్‌లో జరిగిన ప్రీ సేల్స్ దుమ్ము రేపాయి. సినిమా కచ్చితంగా బాక్సాఫీసు సంచలనం కానుందనేందుకు ఇదొక ఉదాహరణ అంటున్నారు సినీ విశ్లేషకులు.
దుమ్ము రేపుతున్న యూఎస్ ప్రీ సేల్స్
యూఎస్‌లో కేవలం 46 ప్రీమియర్ షోలకు సంబంధించిన ప్రీ సేల్స్‌లో ఏకంగా 82 వేల డాలర్లు వసూలు చేసింది. అంటే దాదాపుగా 2900 టికెట్లు విక్రయమయ్యాయి. ఆగస్టు 29 నుంచి పూర్తి స్థాయిలో టికెట్ బుకింగ్ ప్రారంభం కానుంది. యూఎస్ ప్రీ సేల్స్ పరిస్థితే ఇలా ఉంటే ఇక ఫుల్ బుకింగ్ ఓ రేంజ్‌లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలోని రెండు పాటలు ఇప్పటికే విడుదలై బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సువ్వీ సువ్వీ పాటకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇప్పుడు ఓజీ సినిమాకు కావల్సింది ఒకటే…స్ట్రాంగ్ ట్రైలర్..ఎప్పటికప్పుడు అప్‌డేట్స్. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అటు థమన్ సంగీతంపై చాలా ఆశలున్నాయి. ఇమ్రాన్ హష్మి ప్రతి నాయకుడిగా టాలీవుడ్ డెబ్యూ సినిమా ఇది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా అలరించనుంది. టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాగా ఓజీ నిలుస్తుందంటున్నారు.