బాలకృష్ణ అభిమానులకు బిగ్‌షాక్ తగిలింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా అఖండ 2 వాయిదా పడినట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తిరిగి ఎప్పుడనేది ఇంకా తెలియలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న బాలయ్య బాబు కొత్త సినిమా అఖండ 2పై చాలా వార్తలు ప్రచారంలో వచ్చాయి. సినిమా వాయిదా పడదని పదే పదే చెప్పినా అదే జరిగింది. ఫ్యాన్స్ ఏది జరగకూడదని భావించారో అదే అయింది. బాలకృష్ణ అఖండ 2 సినిమా సెప్టెంబర్ 25న విడుదల కావడం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. తద్వారా అదే రోజు విడుదలవుతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఓజీతో బాక్సాఫీసులో ఎదురయ్యే క్లాష్ తప్పించినట్టయింది. ఎవరు ఎవరికి మేలు చేద్దామని సినిమా వాయిదా పడిందో తెలియదు.
మరి కొంత సమయం అవసరం
అయితే అఖండ 2 టీమ్ మాత్రం సినిమా రీ రికార్డింగ్, వీఎఫ్ఎక్స్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేందుకు కొంత అదనపు సమయం కావాలని తెలిపింది. అఖండ్ 1 సూపర్ డూపర్ హిట్ కావడంతో సహజంగానే అఖండ 2పై భారీ అంచనాలున్నాయి. ఈక్రమంలో అంచనాలు చేరుకునేలా సినిమాను మరింతగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నామని అఖండ 2 టీమ్ తెలిపింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని బట్టి సినిమా విడుదల ఎప్పుడనేది తరువాత ప్రకటించనున్నారు.
బాలయ్య అఖండ 2 సినిమాలో సంయుక్త ఫీమేల్ లీడ్ పాత్రలో కన్పించనుండగా ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్ర పోషించనున్నాడు. ఇక ప్రగ్యా జైశ్వాల్, హర్షాయ్ మల్హోత్రాలు కీలక పాత్రల్లో కన్పిస్తారు. 14 రీల్స్ , నందమూరి తేజస్విని బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట ఈ సినిమా నిర్మిస్తున్నారు.