పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ కిక్ ఇచ్చే న్యూస్ ఇది. వారసుడిని ఇండస్ట్రీలో దింపేందుకు పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారట. ఓ ప్రముఖ దర్శకుడికి ఇప్పటికే ఆ బాధ్యతలు కూడా అప్పగించారని టాక్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హరిహర వీరమల్లు సినిమా తరువాత పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ కాగా రెండవది దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించనున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ అతి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ సృష్టించుకున్న నటుడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం జనసేన పార్టీ అధ్యక్షుడిగా , ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ రానున్న కాలంలో సినిమాలు పూర్తిగా వదిలేసి రాజకీయాలపై ఫోకస్ పెట్టవచ్చని తెలుస్తోంది. అందుకే తనకు వారసుడిగా కుమారుడు అకిరా నందన్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమౌతున్నాడని సమాచారం.
ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలను పూర్తిగా వదిలేయవచ్చు. అందుకే వారసుడిని ఇండస్ట్రీకు పరిచయం చేసే ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ మద్యన అకీరా నందన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఫాలోవర్ బేస్ పెంచుకుంటున్నాడు. ఇక మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. అటు యాక్టింగ్‌లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సమాచారం. ఎప్పుడు ఏ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తాడో అధికారికంగా తెలియకపోయినా..కుమారుడిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను మాత్రం ప్రభాస్ దర్శకుడికి అప్పగించారట. ప్రస్తుతం ఓజీ సినిమా తెరకెక్కిస్తున్న సాహో దర్శకుడు సుజిత్‌కు అకీరానందన్ బాధ్యతలు అప్పగించారని టాక్. కొడుకు అకీరా నందన్ తెరంగేట్రం అదిరిపోవాలంటే సుజిత్ సరైన వ్యక్తి అనేది పవన్ నమ్మకంగా ఉంది.
అకీరా నందన్‌పై తండ్రి పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి అంచనాలు, నమ్మకాలున్నాయో గానీ అభిమానులకు మాత్రం చాలా ఆశలున్నాయి. తండ్రి హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తో కచ్చితంగా రాణిస్తాడని అంటున్నారు. ప్రస్తుతానికైతే దర్శకుడు సుజిత్ పేరు విన్పిస్తోంది.