అభిమానానికి ఎల్లలు ఉండవు. హద్దులు చెరిగిపోతుంటాయి. జస్ట్ ఓ సినిమా చూసేందుకు దేశం దాటి వచ్చింది. ఇప్పుడే కాదు..ప్రతిసారీ ఇలా దేశం దాటొచ్చి సినిమా చూసి వెళ్లిపోతుందట. ఇంతకీ ఈమె ఎవరు, ఎవరి అభిమాని, ఏ సినిమా చూసేందుకు వచ్చిందో తెలుసుకుందాం.
ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన వార్ 2 సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మొదటి ఆరు రోజుల్లో 300 కోట్లు వసూలు చేసింది. హృతిక్ రోషన్, తారక్ కలిసి నటించిన ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. సినిమా వసూళ్ల సంగతేమో గానీ తారక్ ఫ్యాన్స్ స్థాయి చూస్తే అందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్‌కు దేశ విదేశాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సాదారణమైంది కాదు. ముఖ్యంగా జపాన్ దేశంలో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ దేశంలో ఏకంగా తారక్ ఫ్యాన్స్ సంఘాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యమే మరి. ఇప్పుుడు వార్ 2 సినిమాకు మంచి క్రేజ్ లభిస్తోంది. అయితే ఓ వీరాభిమాని మాత్రం ఏకంగా ఇండియా వచ్చి మరీ వార్ 2 సినిమా చూసింది.
ఈమె పేరు క్రిసో. జపాన్ దేశానికి చెందిన ఈమె తారక్‌కు వీరాభిమాని. తారక్ సినిమా ఎప్పుడు విడుదలైనా ఇండియాకు వచ్చి మరీ చూసి వెళ్తుంది. అదే విధంగా ఇప్పుడు కూడా వార్ 2 సినిమా చూసేందుకు ఢిల్లీకు వచ్చింది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో తారక్ ఫోటోతో ఉన్న టీ షర్ట్ ధరించి అందర్నీ ఆకర్షించింది. ఇండియా ఎందుకొచ్చావని అడిగితే..తాను తారక్‌కు పెద్ద ఫ్యాన్ అని వార్ 2 సినిమా చూసేందుకే వచ్చానని చెప్పింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాస్తవానికి బాద్ షా సినిమాతో జపాన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్ క్రేజ్ పెరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ క్రేజ్ మరింతగా పెరిగింది. దేవర సినిమా మరింత హైప్ తెచ్చింది. వార్ 2 సినిమా చూసేందుకు వచ్చిన ఈ అభిమాని ఫోటో బాగా వైరల్ అవుతోంది. ఇదీ మా తారక్ లెవెల్ అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.