నిరంతర కష్టం, ప్రతిభ ఉంటే ఏదైనా సాధ్యమే. అదే నిరూపించాడు ఈ నటుడు. చేసింది చిన్న పాత్రలే అయినా అందర్నీ మెప్పించగలిగాడు. అందుకే కోట్ల విలువ చేసే కారు సొంతం చేసుకోగలిగాడు. అతడే మంజుమ్మల్ బాయ్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ అందర్నీ అలరిస్తోంది. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా కలెక్షన్లు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ పోటు అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్ వంటి అగ్రనటులు చాలామంది ఉన్నారు. ఎవరి నటన ఎలా ఉన్నా ఇంతమంది అగ్రనటులతో పాటు ఓ ప్రత్యేక పాత్రలో నటించిన నటుడు మాత్రం అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేశాడు. వాహ్ అన్పించుకుంటున్నాడు. నటనతో అందర్నీ కట్టిపడేశాడు.
ఈ నటుడికి కూలీ సినిమా కొత్తదేమీ కాదు. గతంలో ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తరువాత మంజమ్మల్ బాయ్స్ వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాడు. ఎందుకంటే ఈ వెబ్‌సిరీస్ అంత హిట్ అయింది. ఇప్పుడు తాజాగా కూలీ సీనిమాలో దయాల్ పాత్రతో అందర్నీ ఆకర్షించాడు. అతడే మలయాళ నటుడు సౌబిన్ షాహిర్. కూలీ సినిమా చూసిన ఎవరైనా సరే సౌబిన్ షాహిర్ దయాల్ పాత్రను మర్చిపోలేరు. ఈ పాత్రతో అంతగా ఆకట్టుకున్నాడు. కూలీ సినిమాలో నటనతో అందర్నీ ఆకట్టుకున్న సౌబిన్ షాహిర్ మరోసారి వార్తల్లోకెక్కాడు.
కూలీ విజయాన్ని ముందే పసిగట్టిన సౌబిన్ షాహిర్ తాజాగా బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ కారు కొనుగోలు చేశాడు. ఈ కారు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ కారు విలువ అక్షరాలా 3.30 కోట్లు. ఇప్పటికే తెలుగు, తమిళ దర్శకుల దృష్టిలో పడిన సౌబిన్ షాహిర్‌కు అవకాశాలు రావడం పక్కా. ఇలాంటి బీఎండబ్ల్యూలు మరెన్ని కొంటాడో మరి.