సినిమా విషయాలు ప్రజలకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అందుకే సినిమా అంశాలకు క్రేజ్ ఎక్కువ. బహుశా అందుకే కోర్టు సినిమా హీరోయిన్ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల కామెంట్లతో నిండిపోతోంది. అసలేమైందంటే..
అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మితమై సూపర్ హిట్ కొట్టిన సినిమాల్లో కోర్టు చెప్పుకోదగ్గది. ఈ సినిమాలో నటించిన శ్రీదేవి అమ్మాయికి మంచి పేరు వచ్చేసింది. అంతే వరుసగా తమిళం, తెలుగులో రెండు సినిమాలు ఒప్పేసుకుంది. అప్పుడే జీవితంలో స్థిరపడుతోంది. ఈ క్రమంలో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమెకు పెళ్లయిపోయిందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే ఆమె మెడలో పసుపుతాడు కన్పిస్తోంది. నిజంగానే ఈమెకు పెళ్లయిపోయిందా అసలేమైంది..
ఈ మధ్యనే కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి రాఖీ పండుగ జరుపుకుంది. తన సోదరుడికి రాఖీ కట్టిన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోనే ఇప్పుడు ఈమెకు పెళ్లయిపోయిందనే వార్తలకు కారణమైంది. ఎందుకంటే ఈ ఫోటోలు ఈమె మెడలో పసుపుతాడు స్పష్టంగా కన్పిస్తోంది. ఏంటి అప్పుడే పెళ్లయిపోయిందా, ఎప్పుడు జరిగిందంటూ నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. కొందరైతే అంత త్వరగా పెళ్లి చేసుకోవల్సిన అవసరం ఏమొచ్చిందంటున్నారు.
కానీ వాస్తవానికి ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. రాఖీకు ముందు రోజు తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శుక్రవారం ఉంది. శ్రీదేవి ఇంట్లో కూడా అందా వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తూ పూజలు చేసిన తరువాత మెడలో పసుపు తాడుకి కట్టిన కాయిన్ వేసుకుంది. ఇలా చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. నెటిజన్లు ఆ పసుపుతాడు చూసి పెళ్లయిపోయిందంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇదీ జరిగింది. శ్రీదేవికి ఇంకా పెళ్లి జరగలేదు.