భారీ అంచనాలతో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా రేపు ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు ఉమైర్ సంధూ రివ్యూ ఎలా ఇచ్చాడు. ఎన్ని కోట్లు వసూలు చేయవచ్చనే వివరాలు తెలుసుకుందాం.
లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇది రజనీ కెరీర్‌లో 171వ సినిమా. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే అంచనాలు గట్టిగా ఉన్నాయి. రేపు అంటే ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా తమిళ సినిమా చరిత్రలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా విజయ్ నటించిన లియో పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేస్తుందంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రీ సేల్స్ 100 కోట్లకు చేరువలో ఉన్నాయి. ఇక సినీ విమర్శకులు అంతా సూపర్ బంపర్ హిట్ అంటూ రివ్యూ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధూ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.
పురాతన బంగారు గడియారాల్లోని టెక్నాలజీ ఆధారంగా పాత ముఠాను తిరిగి కలిపే స్మగ్లర్ల నేపధ్యంలో కధ ఉంటుంది. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు కింగ్ నాగార్జున, ఉపేంద్ర, చౌబిన్ సాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, నిత్యారామ్, చార్లీ, జూనియర్ ఎంజీఆర్ నటిస్తున్నారు. ఇక అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో దర్శనమిస్తారు.
ఈ సినిమా అంతా రజనీకాంత్ వన్ మ్యాన్ షోతో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ చూడవచ్చని ఉమైర్ సంధూ అంటున్నాడు. భారీ తారాగణం కూడా ఈ సినిమాకు కలిసి రావచ్చని కితాబిచ్చాడు. స్టోరీ స్క్రీన్ ప్లే యావరేజ్ అయినా చివరి 20 నిమిషాల క్లైమాక్స్ అద్దిరిపోయిందంటున్నాడు. మొత్తానికి 3.5 రేటింగ్ ఇచ్చాడు. ఇక మొదటి రోజు ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లు వసూలు చేస్తుందనే అంచనాలు గట్టిగా ఉన్నాయి. మొదటి రోజు కచ్చితంగా 100-150 కోట్లు దాటుతుందనేది సినీ విశ్లేషకుల అంచనా. చెన్నైలో ఇప్పటికే కూలీ సినిమా టికెట్లు 2వేలకు విక్రయమౌతున్నాయి. బ్లాక్ లో అయితే 4500 వరకు వెళ్లిందని సమాచారం.