కటౌట్ కన్పిస్తే చాలు డ్యూడ్ అంటున్నారు ఫ్యాన్స్. ఎప్పుడు కన్పించారనేది కాదు ఎంత పవర్‌ఫుల్ ఎంట్రీ ఉందనేదే కీలకం. అందుకే కూలీ, వార్ 2 సినిమాల్లో అగ్ర హీరోల ఎంట్రీ ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ రెండు సినిమాల్లో అటు రజనీకాంత్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కన్పిస్తారనేది ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అటు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 కూడా ఇదే రోజు విడుదలవుతోంది. ఈ క్రమంలో రెండు సినిమాల మధ్య ఇప్పటికే అన్‌డిక్లేర్డ్ వార్ మొదలైంది. ఫ్యాన్స్ అంచనాలతో రెండు సినిమాలకు హైప్ పెరిగిపోయింది. ఇదే సమయంలో రెండు సినిమాల్లోనూ హీరోల ఎంట్రీ ఎప్పుడనే అంశంపై అభిమానుల్లో కొత్తగా చర్చ నడుస్తోంది. గతంలో అయితే సినిమా ప్రారంభం అవుతూనే ఫైట్ లేదా పాటతో హీరో ఎంట్రీ ఉండేది. ఇప్పుడిది పాత ట్రెండ్ అయింది. సినిమా మొదలయ్యాక హీరో ఎంట్రీ ఎప్పుడిస్తాడా అనే ప్రేక్షకుడిలో క్రేజ్ పెంచే పని చేస్తున్నారు దర్శకులు. కూలీ, వార్ 2 సినిమాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
స్క్రీన్‌పై రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఎప్పుడు
కూలీ, వార్ 2 రెండు సినిమాల్లో కూడా రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్‌ల ఎంట్రీని దర్శకులు ఇలానే ప్లాన్ చేశారు. కూలీ సినిమా మొదలైన గంట తరువాతే సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ ఉండేలా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తే…వార్ 2 సినిమాలో సినిమా ప్రారంభమైన 30 నిమిషాల తరువాత జూనియర్ ఎన్టీఆర్ కన్పించేలా దర్శకుడు అయాన్ ముఖర్జీ టైమ్ లైన్ సిద్ధం చేశాడు. అభిమాన హీరోల కోసం ధియేటర్‌లో ప్రేక్షకుడిని వెయిట్ చేయించేలా చేసి ఆసక్తి రేపడమే దర్శకుల ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఇలా ఉంటేనే సినిమాకు మరింత హైప్ పెరుగుతుందంటున్నారు.
ఇప్పటికే ఈ రెండు సినిమాల మధ్య అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వార్ నడుస్తోంది. ముఖ్యంగా ఓవర్‌సీస్ ప్రీ సేల్స్‌పై రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. ఏ సినిమా ఎంత హిట్ అవుతుందో వేచి చూడాలి మరి