పుష్ప 2 సినిమాలో ఇంటర్నేషనల్ అని ఎందుకన్నాడో గానీ ఇప్పుడా స్థాయికి చేరుకుంది ఈ సినిమా. అల్లు అర్జున్ కొత్త సినిమా పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మితం కానుంది. ఈ సినిమా కోసం కొత్త ప్రపంచమే సృష్టించనున్నారని సమాచారం. ఆ వివరాలు మీ కోసం.
పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లు రావడంతో అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్ మారిపోయింది. పుష్ప 2లో చెప్పినట్టు ఇప్పుడతని మార్కెట్ ఇంటర్నేషనల్. అల్లు అర్జున్ హీరోగా తమిళ యవ దర్శకుడు అట్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై గత కొద్దిరోజులుగా వస్తున్న అప్‌డేట్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమాను తీయడమే పాన్ వరల్డ్ సినిమాగా తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయిట.
అల్లు అర్జున్ అట్లి సినిమాలో చాలావరకు వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ ఉంటుందట. అందుకే ప్రపంచంలోని అత్యున్నత వీఎఫ్ఎక్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారట. దీనికోసం ఓ హాలీవుడ్ సంస్థ రంగంలో దిగుతుందట. సినిమా కధ ఎలా ఉంటుందనేది ఇంకా తెలియకపోయినా టైమ్ ట్రావెల్, పునర్జన్మ ఆధారంగా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముంబైలోని మెహబూబ్ స్డూడియోలో భారీ స్థాయిలో సినిమా షూటింగ్ జరుగుతోంది.
కొత్త ప్రపంచం సృష్టి
ఈ సినిమాలో దీపికా పదుకోన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీతో పాటు విజయ్ సేతుపతి నటించనున్నారు. 700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కొత్త ప్రపంచమే సృష్టించేందుకు టెక్ నిపుణులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే హాలీవుడ్‌లోని ప్రముఖ వీఎఫ్ఎక్స్ కంపెనీతో ఒప్పందం పూర్తయినట్టు టాక్. ఈ సినిమాను తెరకెక్కించడమే పాన్ వరల్డ్ లెవెల్‌లో చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్‌తో అగ్రిమెంట్ త్వరలో జరగనుందట.