చలనచిత్ర పరిశ్రమలో ఎందరో నటీనటులు వస్తుంటారు. పోతుంటారు. కొందరు స్థిరంగా నిలబడితే మరి కొందరు ఫేడ్ అయిపోతారు. హీరోల సంగతేమో గానీ హీరోయిన్లు అలా మెరిసి ఇలా మాయమౌతుంటారు. అల్లు అర్జున్, ప్రభాస్‌లతో హిట్స్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గప్‌చుప్‌గా ఉద్యోగం చేసుకుంటోంది. ఆ వివరాలు మీ కోసం.
టాలీవుడ్లో చాలామంది హీరోయిన్లు ఉన్నా అందరూ నిలబడలేకపోయారు. కొందర నిలబడే పరిస్థితి ఉన్నా ఎందుకే దూరమైపోయారు. అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ మాత్రం కెరీర్ ఉఛ్ఛస్థితిలో ఉండగానే దూరమైపోయింది. అల్లు అర్జున్, రవితేజ, ప్రభాస్ ఇలా టాప్ హీరోలు చాలామందితో సినిమాలు చేయడమే కాకుండా మంచి పేరు తెచ్చుకుంది. వేదం సినిమాలో అల్లు అర్జున్‌తో, రెబెల్ సినిమాలో ప్రభాస్ సరసన, వాంటెడ్లో గోపీచంద్‌తో కలిసి, నిప్పులో రవితేజతో నటించిన ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు…దీక్షా సేథ్. చివరిగా చేసిన సినిమా 2012లో ఊ కొడతార..ఉలిక్కిపడతారా. ఆ తరువాత అవకాశాలు లేక బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. అక్కడ కూడా పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో సినిమాలు పూర్తిగా వదిలేసింది.
ఇప్పుడేం చేస్తోంది
టాలీవుడ్ అందాలభామ దీక్షాసేథ్ ఇండియా వదిలి లండన్ వెళ్లిపోయింది. వృత్తి రీత్యా ఐటీ టెక్ కావడంతో ఐటీ ఉద్యోగం చేస్తూ అక్కడె సెటిల్ అయిపోయింది. నెలజీతానికి ఉద్యోగం చేసుకుంటూ సొంతంగా ఇళ్లు కూడా కొన్నదట. సినిమా ఇండస్ట్రీకు పూర్తిగా దూరమైనా ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ హాట్ పోజులిస్తోంది. నెట్టింట రచ్చ రేపుతూనే ఉంది.