హీరో రాణ్ చరణ్ భార్యగానే కాకుండా పలు సేవా కార్యక్రమాలతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హెల్త్ కాన్సెస్ ఎక్కువగా ఉండే ఉపాసన కూతురికి కూడా అదే అలవాటు చేస్తోంది. రోజూ ఆ ఫుడ్ తప్పనిసరి అంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మెగా కోడలు, చెర్రీ భార్య ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అయితే అందరికీ పనికొచ్చే ఆరోగ్యపరమైన విషయాలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంటుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ఇటీవల కర్లీ టేల్స్ ఇంటర్వ్యూలో ఆమె చాలా ట్రెండ్ అయింది. కారణం వంటల గురించి, ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి చెప్పిన విషయాలు, చెప్పిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. సహజంగానే ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకునే ఉపాసన ఇప్పుడు ముద్దుల కుమార్తె క్లింకార ఆరోగ్యంపై ఇప్పట్నించే ప్రత్యేక కేర్ తీసుకుంటోంది.
అభిమాన హీరో చెర్రీ కుమార్తె క్లింకార ఎలా ఉంటుందో అభిమానులకు ఇప్పటికీ పూర్తిగా తెలియదు. కేవలం సైడ్ పిక్స్ లేదా బ్యాక్ పిక్స్ మాత్రమే చూశారు. మరి క్లింకారను పూర్తిగా ఎప్పుడు చూస్తారో తెలియదు కానీ ఆ చిన్నారి తీసుకున్న ముఖ్యమైన డైట్ గురించి మాత్రం ఉపాసన షేర్ చేసింది. క్లింకార తీసుకునే ప్రత్యేకమైన ఫుడ్ ఏంటో చెప్పారు. రోజూ డైట్ లో ఆ ఫుడ్ తప్పకుండా ఉంటుందని తెలిపారు. రామ్ చరణ్-ఉపాసన ముద్దుల తనయ క్లింకార రోజూ రాగులు తప్పకుండా తీసుకుంటుందట. రాగులతో చేసిన ఆహార పదార్ధాలు ఆరోగ్యానికి చాలా చాలా మంచివని, చిన్నప్పటి నుంచి ఇష్టమైన ఆహారమని ఉపాసన తెలిపింది. అందుకే తన కూతురికి కూడా ఇదే అలవాటు చేశానని చెప్పింది. సద్గురు జగ్గీ వాసుదేవ్ కూడా రోజూ క్లింకారకు రాగులు ఏదో రూపంలో ఇవ్వమని సూచించారని..అటు ఆయన కుమార్తె రాధే జగ్గీ కూడా అదే చెప్పిందని ఉపాసన పేర్కొంది. బహుశా అందుకే వారిద్దరూ అంత ఫిట్ గా ఉన్నారని తెలిపింది.
భవిష్యత్తులో తన కుమార్తె కూడా ఫిట్ అండ్ హెల్తీగా ఉండేందుకు రోజువారీ డైట్ లో రాగులు చేర్చినట్టు ఉపాసన చెప్పారు. అయితే మోతాదుకు మించకుండా ఇవ్వాలని లేకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చని ఉపాసన సూచిస్తోంది. వీలైతే వైద్యుని సలహా తీసుకుంటే ఇంకా మంచిదని చెప్పింది.